Home తాజా వార్తలు గవర్నర్‌ను కలిసిన చిరంజీవి…

గవర్నర్‌ను కలిసిన చిరంజీవి…

chiranjiviహైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను మెగాస్టార్ హీరో చిరంజీవి మర్యాదపూర్వకంగా కలిశారు. బ్రిటీష్‌రాజుకు వ్యతిరేకంగా పోరాటం చేసిన స్వాతంత్య్ర సమరయోధుడి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సైరా చిత్రాన్ని చూడాలని చిరంజీవి ఆమెను విజ్ఞప్తి చేశారు. దసరా పండుగను పురస్కరించుకొని ఆమెకు చిరంజీవి శుభాకాంక్షలు తెలియచేశారు. ఆమెకు పుష్ఫగుచ్చం అందచేసి శాలువాతో సత్కరించారు.

సైరా చిత్రాన్ని చూడడానికి గవర్నర్ సుముఖత వ్యక్తం చేసినట్టుగా తెలిసింది. చిరంజీవి హీరోగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా సైరా చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రానికి సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహించగా, కొణిదెల ప్రోడక్షన్ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్ నిర్మించారు. నయనతార, తమన్నా, అమితాబ్‌బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్, జగపతిబాబు తదితరులు కీలకపాత్ర పోషించారు. ఈనెల 2వ తేదీన సైరా సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యింది.

Megastar Chiranjeevi Met Governor Tamilisai