Home జాతీయ వార్తలు గిటార్ వాయించిన సిఎం… వీడియో వైరల్

గిటార్ వాయించిన సిఎం… వీడియో వైరల్

Meghalaya CM Sangma plays electric guitar

షిల్లాంగ్: మేఘాలయ ముఖ్యమంత్రి కాన్‌రాడ్ సంగ్మా వీణా వాయించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 1986వ సంవత్సరంలోని మైదాన్ అనే అల్బమ్‌లోని ఓ పాటపై సంగ్మా గిటార్ వాయించారు. మూడు రోజులు అసెంబ్లీ సమావేశాలలో పాల్గొన్నానని, మానసిక ఉల్లాసం కోసం గిటార్ వాయించానని చెప్పారు. గిటార్ వాయించడంతో పొరపాట్లు జరగకుండా వీలవుతుందని పేర్కొన్నారు. ఇప్పుడు ఈ వీడియోను సంగ్మా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. పోస్టు చేసిన 17 గంటలలో 42 వేల మంది వీక్షించగా 19 వేల మంది లైక్ చేశారు.