Wednesday, November 30, 2022

ఎపి హోంమంత్రిగా ‘సుచరిత’

- Advertisement -

 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం 25 మందితో పూర్తిస్థాయి కేబినేట్ ను నియమించారు. వారందరికీ మంత్రి పదవులతో పాటు శాఖలు కేటాయించారు. ఈ సందర్భంగా ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం మంత్రి వర్గానికి ఆమోదముద్ర వేశారు.కాగా, ఎపి ప్రభుత్వం.. ఆళ్ల నాని, అంజాద్ భాషా, నారాయణస్వామి, పిల్లి సుభాష్‌చంద్రబోస్, పుష్పశ్రీవాణిలకు మంత్రి పదవులతో పాటు ఉప ముఖ్యమంత్రి హోదా కల్పించారు. ఈ మేరకు శనివారం సాయంత్రం గవర్నర్, ఎపి ప్రభుత్వ అధికారిక ఉత్తర్వులు వెలువరించాయి. ఇక, మేకతోటి సుచరితకు కీలకమైన హోంశాఖను అప్పగించారు. నవ్యాంధ్రప్రదేశ్‌లో తొలి మహిళా హోంమంత్రిగా మేకతోటి సుచరిత, తొలి మహిళా ఉపముఖ్యమంత్రిగా పుష్పశ్రీవాణిలకు అరుదైన అవకాశం లభించింది.

Mekathoti Sucharitha oath as AP Home minister

Related Articles

- Advertisement -

Latest Articles