Home అంతర్జాతీయ వార్తలు భారత్ పర్యటనకోసం ఎదురు చూస్తున్నా : మెలానియా

భారత్ పర్యటనకోసం ఎదురు చూస్తున్నా : మెలానియా

Melania Trump

 

వాషింగ్టన్: భారత్‌లో తన తొలి పర్యటనకోసం ఎంతో ఉత్సుకతతో ఎదురు చూస్తున్నానని అమెరికా ప్రథమ పౌరురాలు, అధ్యక్షుడు ట్రంప్ సతీమణి మెలానియా ట్రంప్ పేర్కొంది. ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సతీ సమేతంగా ఈ నెల 24, 25 తేదీల్లో భారత్ పర్యటనకు రానున్న విషయం తెలిసిందే. వారు ఢిల్లీతో పాటు ప్రధాని సొంత రాష్ట్రమైన గుజరాత్‌ను కూడా సందర్శిస్తారు.కాగా అమెరికా ప్రథమ పౌరురాలుగా తన తొలి భారత పర్యటన ఇరుదేశాల మధ్య ఉన్న సన్నిహిత సందర్భాలను గుర్తు చేసుకునే వేడుకగా మెలానియా ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. భారత్ సందర్శనకు తనను ఆహ్వానించిన ప్రధాని నరేంద్ర మోడీకి ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. ‘ఈ నెల చివర్లో అహ్మదాబాద్, ఢిల్లీ సందర్శనకోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’ అన్నారు.

Melania Trump Tweets Before India Visit