Wednesday, April 24, 2024

మెలానియా ట్రంప్ విడాకులు?

- Advertisement -
- Advertisement -

Melania Trump will soon be divorcing to Trump

 

వాషింగ్టన్ : ఎన్నికలలో ఓటమి పొందిన అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు వ్యక్తిగత జీవితంలో చిక్కుల్లో పడ్డారు. భార్య మెలానియా ట్రంప్ త్వరలోనే భర్తకు విడాకులు ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని ట్రంప్ సన్నిహిత వర్గాలు తెలియచేశాయి. ట్రంప్ అధికార పీఠం నుంచి వైదొలిగే వరకూ మెలానియా వేచిచూస్తారని, ఈలోగా ఎప్పుడైనా ట్రంప్‌తో తెగతెంపులకు దిగుతారని ట్రంప్ పట్ల ఇప్పుడు అనాసక్తితో ఉన్న వర్గాలు తెలియచేసినట్లు డైలీ మెయిల్ యుకె ఓ వార్తాకథనాన్ని వెలువరించింది. దేశ ప్రథమ పౌరురాలు మెలానియాకు సీనియర్ సలహాదారుగా వ్యవహరించిన స్టెఫెనీ వోల్కాఫ్ ట్రంప్ దంపతుల మధ్య సంబంధాలు అంత బాగాలేవని ఇప్పుడు తెలిపారు. ఇద్దరి 15 ఏండ్ల వివాహజీవిత ఘట్టం ఏ క్షణంలో అయినా ముగియవచ్చునని, ఎన్నికలలో ఓట్ల లెక్కింపు దశ నుంచి కూడా మెలానియా తన భర్తకు డైవర్స్ విషయం గురించి రోజులు క్షణాలను లెక్కిస్తోందని వైట్‌హౌస్ ఆంతరంగికులు ఇంటిగుట్టు విప్పారు.

ఓడినట్లు ఒప్పుకోవాల్సిందే : మెలానియా

భర్త ట్రంప్ ఓటమి పాలయినట్లే అని, ఇప్పటికైనా ఓటమిని అంగీకరిస్తే ఆయనకు అందరికీ హుందాగా ఉంటుందని మెలానియా చెప్పినట్లు వెల్లడైంది. ట్రంప్ సన్నిహితులు, చివరికి అల్లుడు కూడా ట్రంప్‌ను కలిసి ఈ విషయంలో ఆయనకు నచ్చచెప్పేందుకు యత్నించారు. అయితే తాను కోర్టుకు వెళ్లుతున్నట్లు ట్రంప్ తెలిపారు. ఈ దశలోనే భార్య కూడా ట్రంప్ ఇంటిబాటకు సలహా ఇచ్చినట్లు తేలింది. ఇటీవలి ఎన్నికల దశలో కూడా ఆమె భర్త తరఫున ఆలస్యంగా కొద్దిరోజులే ప్రచారానికి వెళ్లారు. పెద్దగా ఉత్సాహం ఆసక్తి కనబర్చలేదు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News