Home తాజా వార్తలు సభ్యత్వం తీసుకుంటే రూ.2 లక్షల బీమా…

సభ్యత్వం తీసుకుంటే రూ.2 లక్షల బీమా…

Membership of TRS

 

తాండూర్ ఇంచార్జి గట్టు రాంచందర్ రావు
ప్రతి కార్యకర్త సైనికునిలా పని చేయాలి
ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి

తాండూర్ : తాండూర్ నియోజక వర్గంలోని యాలాల,పెద్దేముల్, బషీరాబాద్ మండలలో టిఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రతి కార్యకర్త ,నాయకులు సైనికులా పని చేయాలని తాం డూర్ ఇన్‌చార్జి గట్టు రాంచందర్ రావు అన్నారు. శనివారం నియోజక వర్గం యాలాల, బషీరాబాద్,పెద్దేముల్ మండలాల్లో టీఆర్‌ఎస్ సభ్యత్వ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ,పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రతి నియోజక వర్గం నుంచి 50వేల కంటే ఎక్కువ సభ్య త్వం లక్షన్ని నిద్ధేశించారని జూలై 20 లోపు ఇచ్చిన టార్గెట్ పూర్తి చేయాలని పేర్కొన్నారు. సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి రూ.2లక్షల బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. అందుకు పార్టీ కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు వి వరించి సభ్యత్వం నమోదును చేయించాలని అన్నారు

ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అమ లు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఈ నెల20 లోపు సభ్యత్వ నమోదు పూర్తి చేయలని అ న్నారు. జిల్లా చైర్మన్,ఎంపి నిధులు,ఎమ్మెల్సీ నిధులతో తాండూరు నియోజకవర్గంలో ప్రతిగ్రామంలో అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. కెసిఆర్, కెటిఆర్ ఆశీస్సులతో తాండూరులో అనేక అభివృద్ధి పనులు చేసినట్లు తెలిపారు.తాండూరు మున్సిపల్ పరిధిలోని రూ.50కోట్ల నిధులతో సిసిరోడ్లు నిర్మాణం పనులు ఆగిపోయి నా పనులను పునర్నిర్మా ణ ం చేసినట్లు చె ప్పారు. రా జీ వ్ గృహకల్ప నుంచి రైల్వేస్టేషన్ వరకు డబుల్‌రోడ్డు ని ర్మాణం, ఎల్‌ఈడి బల్బులతో సెంట్రల్‌లైటింగ్ ఏర్పాటు చేస్తానని అన్నారు. కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులకు కా గ్నావంతెన, జీవన్గి బ్రిడ్జి, హైదరాబాద్ నుంచి తాండూరు ఫోర్‌లైన్ రోడ్డు పనుల ను , తొర్మామిడి నుంచి ఆత్కూర్ వర కు , ఇందురు నుంచి ఆత్కూర్ వరకు, పెద్దేముల్ నుంచి కోటపల్లి నుంచి బంట్వారం వరకు సిసిరోడ్డు పనులను వేగవంతం చేస్తామని పేర్కొన్నారు. తాండూరు రూపురేఖలను మారుస్తానని పేర్కొన్నారు.

శాసన సభ్యులు పైలెట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ పాత, కొత్త భేదాలు లేకుండా పార్టీ అభివృద్ధికి అందరం కలసికట్టుగా పని చేసి పార్టీలో కలహాలు లేకుండా కలసికట్టుగా పనిచేయాలని పేర్కొన్నారు అనుకున్న టార్గెట్ ను 20 లోపు పూర్తి చేసేందుకు సహకరించాలని అ న్నారు. ప్రతి టిఆర్‌ఎస్ కార్యకర్త ఉద్యమంలా సభ్యత్వం నమోదును చేపట్టాలన్నారు సాధారణ సభ్య త్వం కంటే క్రియాశీల సభ్యత్వంపై ఎక్కువ దృష్టి సారించాలని పేర్కొన్నారు సిఎం కెసిఆర్ ప్రవేశపెట్టిన అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాల ద్వారా ఇప్పటికే అనేక మంది కార్యకర్తలు ప్ర జలు స్వచ్ఛందంగా టిఆర్‌ఎస్‌లో చేరి సభ్యత్వం కోసం వేచి చూ డడం సంతోషకరమని అ న్నారు. బం గారు తెలంగాణ సాధనకు సిఎం అహో రా త్రులు క్షేమిస్తూ ప్రజల సంక్షేమమే ధేయ్యంగా పని చేస్తు న్నారు. ఆయన అడు గుజడల్లో నడుసూ ్త తెలంగాణ సాధనకు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో యాలాల టిఆర్‌ఎస్ నాయకులు సాయులు గౌడ్ సిద్రాల శ్రీనివాస్ కరణం పురోషోత్తంరావు, రవిందర్, బసప్పబుట్టి, పెదేముల్ నాయకులు లక్ష్మరెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, కో ము గోపాల్‌రెడ్డి,జీవరత్నం, గాజీపూర్ నారణ్‌రెడ్డి,టీఅర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Membership of TRS Rs. 2 lakh Insurance