Home వార్తలు డైలీ ఫైనాన్షియర్ వేధింపులకు చిరు వ్యాపారి బలి

డైలీ ఫైనాన్షియర్ వేధింపులకు చిరు వ్యాపారి బలి

suicide1మన తెలంగాణ/సిటీబ్యూరో:డైలీ ఫైనాన్షియర్ వేధింపులు భరించలేక ఓ చిరువ్యాపారి ఉరి వేసు కుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఛాదర్ ఘాట్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.మలక్‌పేట్ పల్టన్‌కు చెందిన మహ్మద్ అహ్మద్ (25) వాటర్ సర్వీసింగ్ సెంటర్ నిర్వహి స్తున్నాడు. వ్యాపారంలో లాభాలు రాకపోవడం తో ఇంటి ఖర్చుల కోసం ఐదారు మంది డైలీ ఫైనాన్షియర్స్ వద్ద డైలీ ఫైనాన్స్ తీసుకున్నాడు. ఒక్కో ఫైనాన్షియర్ నుంచి రూ.2000 నుంచి రూ.5000 వరకు డైలీ ఫైనాన్స్ తీసుకున్నాడు. వ్యాపారం సరిగా నడవకపోవడంతో డైలీ ఫైనాన్స్ కట్టడం కష్టంగా మారింది. సుమారు 15 రోజుల నుంచి ఇతను డైలీ ఫైనాన్స్ కట్టడంలేదు. దీంతో సదరు ఫైనాన్షియర్లు అహ్మద్‌కు బెదిరించినట్లు తెలిసింది. ఇటు ఫైనాన్షియర్ల బెదిరింపులు, అటు ఆర్ధిక ఇబ్బందుల నేపథ్యంలో అహ్మద్ తన జీవితంపై విరక్తి పెంచుకున్నాడు. శుక్రవారం అర్ధరాత్రి తరువాత ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శనివారం ఉదయం అహ్మద్ ఆత్మహత్య విషయం వెలుగు చూడడంతో ఫైనాన్షియర్లు అతని కుటుంబ సభ్యులను సైతం బెదిరించినట్లు తెలిసింది. తమపై ఫిర్యాదు చేస్తే తీసుకున్న డబ్బులకు డబుల్ డబ్బులు కట్టాల్సిందేనని హెచ్చరించారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు ఫైనాన్షియర్ల వేధింపులపై ఫిర్యాదు ఇవ్వడానికి జంకుతున్నారు. ఆర్ధిక ఇబ్బందుల వల్లనే అహ్మద్ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.