Home తాజా వార్తలు కాంటాలో కానరాని తిరకాసు..?

కాంటాలో కానరాని తిరకాసు..?

Merchants

 

కనీస మద్ధతు ధర చెల్లించని వ్యాపారులు
ఏళ్ళుగా నష్టాల బాటలో పత్తిరైతు
అప్పును ఆసరా చేసుకొని అధిక వడ్డి వసూలు

బిజినేపల్లి: మండలంలోని ఆయా గ్రామాలలో రైతులు పండించిన పంటకు వివిద రూపాల్లో మోసాలు జరుగుతూనేఉన్నాయి. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఎన్నో ఏళ్ళుగా రైతులు ఆరుగాలం కష్టించి పం డించిన పంటకు గిట్టుబాటు ధర రావడం లేదని దీనికి తోడు దళారులు పత్తి కొనుగోలు చేసే క్రమంలో కంప్యూటర్ కాంటాలా పేరుతో కళ్లుగప్పి రైతులను మోసం చేస్తున్నారని ఈతేడాలను అరికట్టడంకోసం ఎన్ని రకాల ప్రయాత్నాలు చేసిన ఫలితం మాత్రం శూన్యంగానే ఉంది సిసిఐ కేంద్రాలు కొనుగోలు కంటే ముందు గ్రామీణ ప్రాంతాలలో ఉన్న దళారులు రైతుల వద్ద తక్కువ ధరలకే పత్తిని కొనుగోలు చేస్తారు.

ప్రస్తుత సంవత్సరం మొద ట వర్షాలు రాక కొన్ని రోజుల తర్వాత వచ్చిన అధిక వర్షాలతో కేవలం మండలంలో 9శాతం మాత్రమే సాగు చేశారు. పండిన పంటకు సరైన గిట్టుబాటు ధర లేకపోవడంతో దళారులు తూకంలో మోసం చేయడంతో తీవ్రంగా నష్టపోతున్నారు. ఇంతజరుగుతున్న అధికారులు మాత్రం నిద్రా వస్థలో ఉన్నారు. దీనికి తోడు గతంలో మండల కేంద్రంలో పాటు మండ లంలో ఆయా గ్రామాలలో దళారులు తూకాలలో పదుల సంఖ్యలో తేడా లు చూపించి మోసంచేశారని మండల కేంద్రంలో రెండు, మూడు సార్లు, ఆందోళనలు జరిగిన దాఖలాలున్నాయి.

కొంతమంది అధికారులు ఏమి పట్ట న్నట్లు వ్యవహరించడంవల్ల మళ్లీ తూకాలు మొదలయ్యాయి. ధనా ర్జనే ధ్యేయంగా దళారులు ష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి రైతు పండించే పంటలకు తేడాలు రాకుండా కనీస మద్దతు ధర కల్పించాలని రైతులు కోరుకుంటు న్నారు.

Merchants who do not pay minimum support price