Home ఆఫ్ బీట్ పర్యావరణాన్ని కాపాడుదాం..

పర్యావరణాన్ని కాపాడుదాం..

Methods and Importance of Environmental Conservation

పండుగల పరమార్థం ఆరోగ్యం, ఆనందం, పర్యావరణ పరిరక్షణ. ఈ విషయాన్ని చాలామంది మర్చిపోతున్నారు. పర్యావరణానికి నష్టాన్ని కలిగించే రీతిలోనే చాలామంది సంబరాల్ని జరుపుకోవడం దురదృష్టకరం. వినాయక చవితి అనగానే పెద్ద పెద్ద విగ్రహాలు వీధులనిండా దర్శనమిస్తుంటాయి. అవన్నీ ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారుచేసినవి. వివిధ హానికరమైన రంగులు అద్దినవి. మట్టి ప్రతిమలు మాత్రం అక్కడక్కడా దర్శనమిస్తుంటాయి. వాటి జోలికి మాత్రం చాలా తక్కువ మంది వెళ్తుంటారు. హంగూ ఆర్భాటాలకు పోయి, పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టర్‌ఆఫ్‌పారిస్ వినాయక ప్రతిమలను కొన్ని మనకు మనమే ముప్పు కొనితెచ్చుకుంటున్నాం. ఈమధ్య ఎకో ఫ్రెండ్లీ వస్తువులపై అవగాహన, ప్రచారం ఎక్కువే జరుగుతోంది. ఈ నేపథ్యంలో పర్యావరణానికి హితాన్ని కలిగించే మట్టి గణపతులనే పూజించి, మనవంతు బాధ్యతగా ప్రకృతిని కాపాడదాం…

దేశప్రజలంతా ఆనందంగా జరుపుకునే పండుగలలో గణేష్ చతుర్థి ఒకటి. విఘ్నేశ్వరుడు జ్ఞానాన్ని, శక్తిని ప్రసాదించే మహిమ గల దేవుడు. ఈ పండుగ తొమ్మిది రోజులూ ‘గణపతి బొప్పా మోరియా’ అనే నినాదాలు ప్రతి చోటా మారుమోగుతుంటాయి. మన జీవితాన్ని కాపాడే వనరులలో ఒకటైన ప్రకృతిని సంరక్షించుకోవడం మన బాధ్యత. ప్లాస్టర్ ఆఫ్ పారిస్, భూమిలో కలవని పదార్థాలతో కూడా విగ్రహాలు తయారవుతున్నాయి. వాటివల్ల రాబోయే నష్టాల గురించి తెలుసుకుందాం…

రసాయనాలు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో కలిగే నష్టాలు
1. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అనేది సహజసిద్ధంగా దొరికే పదార్థం కాదు. ఇది నీటిలో కరగడానికి కొన్ని నెలల సమయం పడుతుంది. 2. విగ్రహాల తయారీకి ఉపయోగించే రసాయనల్లో పాదరసం,లెడ్‌వంటి భారీ ఖనిజాలు ఉంటాయి. వీటితో కలిపిన ద్రవాన్ని విగ్రహాల తయారీకి ఉపయోగిస్తారు. వీటిలో ఎరుపు, నీలం, ఆరెంజ్, ఆకుపచ్చ రంగులు కలిసిన పాదరసం; జింక్‌ఆక్సైడ్, లెడ్, క్రోమియం ఖనిజాలను ఎక్కువగా ఉపయోగిస్తారు.                                                                                                            3. జిప్సమ్, సల్ఫర్, ఫాస్సరస్, క్రోమియం, జింక్ ఆక్సైడ్, పాదరసం వంటి హానికరమైన ఖనిజాలని విగ్రహాల తయారీలో వాడతారు.                                                                                                                                                                      4. నదులు, సముద్రాల్లోని జీవరాశులకు ఈ పదార్థాలన్నీ ఎంతో హానికరకమైనవి. వీటి మూలంగా చాలా చేపలు , ఇతర జీవులు చనిపోతాయి.                                                                                                                                                    5. విగ్రహాలకి ఉపయోగించే మెరుపులు ఊపిరితిత్తుల పనితీరును అడ్డగిస్తుంది, కంటి చూపు దెబ్బతినేలా చేస్తుంది.                6. విగ్రహాలని నిమజ్జనం చేసిన నీటిని చెట్లకు కూడా వాడకూడదు. ఆ నీటిలోని ఖనిజాలు చెట్లని నాశనం చేస్తాయి. ఇటువంటి నీటిని మనం వాడితే పిల్లలకి ఆటిజం, ఎడిహెచ్‌డి లాంటి రోగాలు సంభవిస్తాయి.
పర్యావరణ హితమైనవి
1. మట్టితో తయారు చేసిన గణేష్ విగ్రహాలనే పూజించాలి. 2. కొబ్బరి, మట్టి, సహజసిద్ధమైన రంగులతో తయారు చేసిన విగ్రహాలని కొనుగోలు చేయాలి. 3. ప్రసాదాల పంపిణీలో అరటి ఆకులను ఉపయోగించాలి. ప్లాస్టిక్ ప్లేట్లు, ప్లాస్టిక్ గ్లాసులు నిషేధించాలి. 4. నిమజ్జనానికి కృత్రిమ ట్యాంకులను వాడితే మంచిది. సహజసిద్ధమైన చెరువులు లాంటి నీటి వనరులని ఉపయోగించకూడదు. 5. మట్టి వినాయకులని, పర్యావరణ అనుకూలమైన విగ్రహాలని కొనేవారిని ప్రోత్సహించాలి. వారికి బహుమతులను అందచేసి తగిన ప్రోత్సాహం కల్పించాలి. 6. మూడు ఆర్‌ల ( తగ్గించు, తిరిగి వినియోగించు, రీసైకిల్) రూల్ ని అమలుపరచాలి. 7. పేలుడు పదార్థాలని, మెరుపులను రద్దు చేయాలి. 8. హానికారకమైన రసాయనాలన్నింటిని రద్దు చేయాలి. దీనిమీద అవగాహన అందరిలో కలిగించి ఎకోఫ్రెండ్లీ, గ్రీనరీ గణేష్ విగ్రహాలను అందచేస్తే కాలుష్యం బారినుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు.

                                                                                              – సుమన్ సరాఫ్ మాధవ్ ఆటిజం ఫౌండేషన్, హైదరాబాద్