Thursday, April 25, 2024

కన్‌స్ట్రక్షన్ వీక్ ఇండియా అవార్డుల అందుకున్న మెట్రో రైల్

- Advertisement -
- Advertisement -

పర్యావరణ పరంగా అన్ని మార్గదర్శకాలను మెట్రో అనుసరిస్తుంది:  ఎండీ కెవిబీరెడ్డి

Metro Rail Receives Construction Week India Awards
మన తెలంగాణ,సిటీబ్యూరో: ఎల్ అండ్ టీ మెట్రో రైల్ లిమిటెడ్ అత్యంత ప్రతిష్టాత్మకమైన కన్‌స్ట్రక్షన్ వీక్ ఇండియా అవార్డులు 2021లో ప్రాజెక్ట్ అవార్డును మెట్రో రైల్ ప్రాజెక్ట్‌లైఫ్‌సైకిల్ ఎకనమిక్స్ బెనిఫిట్స్ విభాగంలో అందుకుంది. ఎల్ అండ్ టీ ఎంఆర్‌హెచ్‌ఎల్ చీప్ ఆపరేటింగ్ ఆపీసర్ సుదీర్ చిపుంకర్ అవార్డులు ముంబైలో జరిగిన 11వ కన్‌స్ట్రక్షన్ వీక్ ఇండియా అవార్డు వేడుకల్లో అందుకున్నారు. ఈవేడుకల్లో పరిశ్రమ నిపుణులు ఇతర అవార్డు విజేతలు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కన్‌స్ట్రక్షన్ వీక్ ఇండియా అవార్డులు అందజేస్తారు. బారతదేశపు సుప్రసిద్ద రియల్ ఎస్టేట్, మౌలిక వసతుల కంపెనీలను 19 విభాగాల్లో గుర్తించి,గౌరవించే రీతిలో ఈవార్డులు ఉంటాయి.

ఈ అవార్డుల విజేతలను పరిశ్రమ నాయకులు, సాంకేతిక నిపుణులు, సీజన్డ్ కన్సల్టెంట్‌లతో కూడిన న్యాయ నిర్ణేతల బృందం ఎంపిక చేస్తుంది. ఈసందర్భంగా ఎల్ అండ్ టీ ఎంఆర్‌హెచ్‌ఎల్ ఎండీ అండ్ సీఈవో కెవీబీరెడ్డి మాట్లాడుతూ అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డులను అందుకోవడాన్ని ఓగౌరవంగా మేము బావిస్తున్నామని, ఈగుర్తింపును అందజేసిన కన్‌స్ట్రక్షన్ వీక్‌కు ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద పీపీపీ నమూనాగా, బారతదేశంలో రెండవ అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్‌గా మేము నిరంతరం అందుబాటులో ప్రయాణావకాశాలను సమయం ఆదా చేయడం, కాలుష్యం తగ్గించడం , విద్యుత్ వినియోగం, కార్బన్ ఉద్గారాలను తగ్గించడం వంటి ప్రయోజనాలను అందించడానికి కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుత కోవిడ్ కాలంలో కూడా హైదరాబాద్ మెట్రో రైల్ అత్యంత సురక్షితమైన ప్రయాణ అవకాశంగా నగరవాసుల మదిలో నిలిచింది.

లక్షలాది మంది మార్గదర్శకాలను అనుసరిస్తూ మెట్రోలో ప్రయాణిస్తున్నారని పేర్కొన్నారు. నగరవాసుల ఉత్పాదకతను మెరుగుపరుచడంలో హైదరాబాద్ మెట్రోరైల్ పాత్ర కీలకం. ఒత్తిడిలేని సురక్షితమైన ప్రయాణవకాశంగా మెట్రోరైల్‌ను నగరవాసులు ఎంచుకున్నట్లు చెప్పారు. పర్యావరణ పరంగా అన్ని మార్గదర్శకాలను మెట్రో రైల్ అనుసరిస్తుంది. మెట్రోరైల్‌లో 8.35 మెగా వాట్ పవర్ సోలార్ ప్లాంట్స్ రెండు డిపోల వద్ద ఉండటంతో పాటుగా 28 మెట్రో స్టేషన్లలోను రూప్‌టాప్ సోలార్ ప్లాంట్స్ ఉన్నాయి. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐజీబీసీ ప్లాటినమ్ రేటింగ్‌ను తమ 20 స్టేషనకు మెట్రో రైల్ అందుకున్నట్లు వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News