Home తాజా వార్తలు మార్చిలో హైటెక్ సిటీకి మెట్రో రైలు

మార్చిలో హైటెక్ సిటీకి మెట్రో రైలు

Metro Rail

 

భద్రతా ఏర్పాట్లపై అందని అనుమతులు
నిత్యం నిర్వహిస్తున్న ట్రయల్న్ పనులు

మన తెలంగాణ / సిటీబ్యూరో: అమీర్‌పేట్ నుంచి హైటెక్ సిటీ వరకు మెట్రోరైలు మార్చిలో ప్రారంభించేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధ్దమవుతోంది. వాస్తవానికి ఫిబ్రవరిలోనే ప్రారంభించాలనుకున్నా కొన్ని పరిపాలనా పరమైన అనుమతులు అందకపోవడంతో అదికాస్త వచ్చే నెల మార్చిలో నడపాలని హెచ్‌ఎంఆర్ అధికార య ంత్రాంగం భావిస్తున్నది. ట్రయల్ రన్ నిత్యం జరు గుతున్నప్పటికీ భద్రతా విషయాలపై ఉన్నతస్థాయి నుంచి రావాల్సిన అనుమతులకు మరికొంత సమ యంపడుతున్నందున హైటెక్‌సిటీకి మెట్రోను వచ్చే నెలలో అందించాలని అధికారులు నిర్ణయించినట్టు స మాచారం. ఇంకా సాగుతున్న మెట్రో నిర్మాణ ప నులు, బధ్రతా తనిఖీల ప్రక్రియ పూర్తికాలేదు. ఇవి పూర్తిచేసేందుకు మరింత గడువు అవసర మ వుతున్నది. అయితే, అమీర్‌పేట నుంచి హైటెక్‌సిటీ వరకు 10 కి.మీ.ల మెట్రో మార్గంలో ఎనిమిది మెట్రో స్టేషన్‌లు ఉన్నాయి. వాటిలో ఇంకా మెట్లు, లిఫ్టులు, ఎస్కలేటర్‌ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. మధురానగర్ స్టేషన్ వద్ద సుందరీకరణ పనులు చేప ట్టాల్సి ఉంది. యూసుఫ్‌గూడ చెక్‌పోస్టు స్టేషన్ వద్ద ఒకప్రక్క మెట్ల మార్గాన్ని నిర్మిస్తున్నారు. దుర్గం చెరువు వద్ద ఒక వైపు మెట్లు, లిఫ్టు నిర్మించారు.

రెండోవైపు కూడా వాటిని నిర్మించాల్సి ఉన్నది. పె ద్దమ్మగుడి మెట్రో స్టేషన్ వద్ద ఎస్కలేటర్ నిర్మాణం, సుందరీకణ పనులు కొనసాగుతున్నాయి. పెద్ద మ్మగుడి నుంచి హైటెక్ సిటీవరకు సింగిల్ లైన్‌లోనే మెట్రో వెళ్లి రావలసి ఉంది. ఈ మార్గంలో ఎక్కువగా మలుపులు, ఎత్తు పల్లాలు ఉండటంతో అత్యంత క్లిష్టమైందని హెచ్‌ఎంఆర్ అధికారులు అంటున్నారు. అందుకే ఎంతో జాగ్రత్తతో క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించిన అనంతరమే మెట్రోను ఈ మార్గంలో నడపాలని అధికారులు భావిస్తున్నారు. కమీషనర్ ఆఫ్ మెట్రో రైలు సేఫ్టీ (సిఎమ్‌ఆర్‌ఎస్) అధికారుల తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ మార్గంలో నిపుణుల బృందం క్షేత్రస్థాయి పరీక్షలు ఎప్పుడు పూర్త చేస్తుందో ఇప్పుడప్పుడే చెప్పలేని పరిస్థితి నెలకొన్నది.

మెట్రో రైలు టిక్కెట్టు ధర కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రజలు మెట్రోలోనే ప్రయాణం చేసేందుకు అసక్తి చూపిస్తున్నారు. అందుకు నిదర్శనం రోజురోజుకు మె ట్రోరైలుకి పెరుగుతున్న ఆదరణ. ట్రాఫిక్ సమస్య లేకుండా, కాలుష్యానికి దూరంగా ఎంత దూరమైనా సౌకర్యంగా నిమిషాలలో ప్రయాణించవచ్చనేది మె ట్రోరైలు ప్రయాణికలు సదాభిప్రాయం. ఇప్పటి వరకు నగరంలో రెండు కారిడార్‌లు కలిపి 46 కి.మీ నిత్యం 2 లక్షల మంది ప్రయాణిస్తుంటే, అమీర్‌పేట హైటె క్‌సిటీ మార్గం ఎంతో రద్దీగా ఉంటుందని దీని ప్రధా నకారణం ఎక్కువగా ఐటి కంపెనీలు అన్నీ ఈ మార్గ ంలో ఉండటమే అని అధికారులు ఈ అంచనాకు వస్తు న్నారు. ఏది ఏమైనా అన్ని అడ్డంకులను సవాళ్ళను అదిగమించి హైటెక్‌సిటీ మార్గంలో మెట్రోరైళ్లను త్వరలో ప్రారంభిస్తామని మెట్రో అధికారులు వివరించారు.

పారంభోత్సవానికి సీఎం కార్యాలయంతో సంప్రదింపులు…
కమీషనర్ ఆఫ్ మెట్రో రైలు సేఫ్టీ నుంచి అనుమతి పత్రాలు అందిన వెంటనే హైటెక్‌సిటీ మెట్రో ప్రార ంభం కోసం ముఖ్యమంత్రి కార్యాలయాన్ని సంప్ర దించి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన తేదీల్లోనే ప్రారంభోత్సవ ముహుర్తాన్ని ఖరారు చేస్తామని హె చ్‌ఎంఆర్ అధికారులు వివరించారు.

Metro Rail to HiTech City from Ameerpet in March