Home తాజా వార్తలు అరెస్టర్ రాడ్ పడిపోవడంతో ఆగిన మెట్రో రైలు: ఎన్‌విఎస్ రెడ్డి

అరెస్టర్ రాడ్ పడిపోవడంతో ఆగిన మెట్రో రైలు: ఎన్‌విఎస్ రెడ్డి

Metro Train

హైదరాబాద్: బలమైన గాలులు వీచడంతో అసెంబ్లీ స్టేషన్ దగ్గర ట్రాక్ పై అరెస్టర్ రాడ్ పడిపోయిందని మెట్రో ఎండి ఎన్‌విఎస్ రెడ్డి తెలిపారు. ముందు జాగ్రత్త చర్యగా విద్యుత్ సరఫరా నిలిపివేశామన్నారు. రాడ్‌ను తొలగించిన తరువాత మెట్రో రైలును పునరుద్ధరించామని వివరించారు. ప్రయాణికుల క్షేమం కోసం అరగంట పాటు రైలు రాకపోకలు నిలిచిపోయాయని, తెలిసితెలియకుండా మెట్రో రైలుపై దుష్ప్రచారం చేయడం సరికాదని ఎన్‌విఎస్ రెడ్డి సూచించారు. మెట్రో రైలులో సమస్యలంటూ వస్తున్న వార్తలను కొట్టిపారేశారు.