Home మల్కాజ్‌గిరి (మేడ్చల్) రైళ్ల టైమింగ్ మారింది

రైళ్ల టైమింగ్ మారింది

‘మెట్రో’ సమయాల్లో స్వల్ప మార్పులు

Whether metro problems are solved

మన తెలంగాణ/సిటీబ్యూరో : మెట్రో రైళ్ల టైమింగ్ మారింది. మెట్రో రైళ్ల రాకపోకల వేళల్లో స్వల్ప మార్పులు చేసినట్లు ఎల్‌అండ్‌టి పేర్కొన్నది. ఈ మార్పులు తాత్కాలికమేనని ఎల్‌అండ్‌టీ తెలిపింది. ప్రతి రోజు ఉదయం ప్రారంభమయ్యే మొదటి రైలు సమయాల్లో మార్పులు చేశారు. సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యే ట్రైన్లు ఉదయం 6.30 గంటలకు ప్రారంభమవుతాయి.

అలాగే ఆదివారాల్లో ఉదయం 6గంటలకు ప్రారంభమయ్యే రైళ్ల రాకపోకలు ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతాయి. అంటే సోమవారం నుంచి శనివారాల్లో రైళ్ల సమయాలు అరగంట ఆలస్యంగానూ, ఆదివారం ఒక గంట ఆలస్యంగానూ మెట్రో రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. ఈ మార్పులు తాత్కాలికమేనని, సోమవారం(జూలై 16) నుంచి ఈ మార్పులు చోటు చేసుకుంటాయని అధికారులు పేర్కొన్నారు. అయితే వివిధ స్టేషన్ల నుంచి బయలుదేరే చివరి రైళ్ల సమయాల్లో ఎలాంటి మార్పులు ఉండవు. అమీర్‌పేట్‌ఎల్బీనగర్, అమీర్‌పేట్‌హైటెక్‌సిటీ రూట్లల్లో ట్రైయల్ రన్‌లు చేపడుతుండటంతో ఈ మార్పులు చేసినట్లు ఎల్‌అండ్‌టీ పేర్కొన్నది. ఈ అసౌకర్యాన్ని, అంతరాయాన్ని ప్రజలు గమనించగలరని తెలిపింది.