Home ఆఫ్ బీట్ వీడియోలు అన్నీ బైక్‌పైనే కానిచ్చేస్తుందిగా…!(వీడియో)

అన్నీ బైక్‌పైనే కానిచ్చేస్తుందిగా…!(వీడియో)

Miami Womanఅది అందమైన నగరం మియామి.. వాహనాల రాకపోకలతో బిజీగా ఉన్న రోడ్డు. ట్రాఫిక్ కూడా ఎక్కువగానే ఉండడంతో జనాలు తంటాలు పడుతున్నారు. ఇంతలో ఓ సిగ్నల్ వద్ద రెడ్ లైట్ పడటంతో వాహనాలు ఆగాయి. ఆ సమయంలో బైక్ పై వెనకాల కూర్చున్న ఓ యువతి చేసిన పని ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఇంతకు ఆమె ఏం చేసిందో తెలుసా? స్విమ్ సూట్ వేసుకుని ఉన్న ఆ యువతి ఏంచక్క ఓ రేజర్ తో తన కాళ్లపై ఉన్న అవాంఛిత రోమాలను తొలగించుకుంటూ బిజీగా ఉండటమే. ఓ వ్యక్తి ఆ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. అంతే.. ఆ వీడియో కాస్తా వైరల్ అవుతోంది. వీడియోను చూసిన వారంతా ‘ఇది మియామీ స్పెషల్’ అని కామెంట్లు చేస్తున్నారు.

Miami Woman Shaves Legs on Back of Moped

I can't make this up

ONLY in DADE यांनी वर पोस्ट केले बुधवार, ६ फेब्रुवारी, २०१९