Thursday, April 25, 2024

ఆర్‌బిఐ డిప్యూటీ గవర్నర్‌గా మైకెల్ పాత్ర

- Advertisement -
- Advertisement -

Michael-Patra

ముంబై: ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) డిప్యూటీ గవర్నర్‌గా మైకెల్ దేబబ్రత పాత్ర నియమితులయ్యారు. డిప్యూటీ గవర్నర్‌గా 3 ఏళ్లు కొనసాగనున్నారు. పాత్రా ప్రస్తుతం ఆర్‌బిఐ ద్రవ్య విధాన విభాగంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఆయన ద్రవ్య విధాన కమిటీ (ఎంపిసి)లో సభ్యుడు కూడా. 2019 జులై 23న విరాల్ ఆచార్య రాజీనామా చేసిన తర్వాత డిప్యూటీ గవర్నర్ పోస్టు ఖాళీగా ఉంది.

విరాల్ ఆచార్య ఈ విభాగంతో సహా అనేక ఇతర విభాగాలకు కూడా బాధ్యత వహించారు. త్రైమాసిక జిడిపి వృద్ధి 6 ఏళ్లలో కనిష్ట స్థాయికి, ఆరేళ్ల గరిష్టానికి ద్రవ్యోల్బణం చేరుకున్న నేపథ్యంలో పాత్రను డిప్యూటీగా నియమించారు. ఈ సవాళ్లను ద్రవ్య విధాన కమిటీలో పరిష్కరించాల్సి ఉంటుంది. గతేడాది రెపో రేటును వరుసగా మూడుసార్లు తగ్గించగా, ప్రతిసారి పాత్ర వడ్డీ రేటు తగ్గింపునకే అనుకూలంగా ఓటు వేశారు. పాత్రా ఆర్‌బిఐ నాలుగో డిప్యూటీ గవర్నర్‌గా వ్యవహరించనున్నారు. ఈ ప్యానెల్‌లో బ్యాంకింగ్, ఆర్థిక కార్యదర్శి రాజీవ్ కుమార్ కూడా ఉన్నారు. ప్రధానమంత్రి కార్యాలయం పాత్రా పేరిట తుది ఆమోదం తెలిపింది. ఆర్‌బిఐ గత ఏడాది వరుసగా 5 సార్లు రెపో రేటును మొత్తం 1.35 శాతం తగ్గించింది.

Michael Patra appointed As deputy governor of RBI

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News