Friday, April 26, 2024

కాలుష్య కలకలం.. మనిషి రక్తంలోనూ ప్లాస్టిక్ కణాలు

- Advertisement -
- Advertisement -

Microplastics Found In Human Blood

లండన్ : కాలుష్యం వాతావరణం, పర్యావరణాలను దాటి చివరికి మనిషి రక్తంలోనూ తిష్టవేసుకొంటోంది. కాలుష్య ప్రధాన కారకమైన సూక్ష్మ ప్లాస్టిక్ కణాలు (మైక్రోప్లాస్టిక్స్) మానవ రక్తంలో పేరుకుపోయి ఉండటాన్ని పరిశోధకులు గుర్తించారు. మనిషి శరీరంలోని రక్తంలో ఈ మైక్రోప్లాస్టిక్స్ నిల్వలు బయటపడటం మానవ శారీరక శాస్త్ర చరిత్రలో ఇదే తొలిసారి. నెదర్లాండ్స్‌లో పరిశోధకులు పలు రక్తపు నమూనాలను అధ్యయనం చేశారు. ఈ దశలో రక్తంలో ఈ ప్లాస్టిక్ రేణువులు ఉన్నట్లు నిర్థారణ అయింది. మైక్రోప్లాస్టిక్స్ శరీరంలోకి చేరడమే కాదు మనిషి అవయవాల్లోకి రక్తంలోకి చొచ్చుకుపోతాయనే విషయం ఈ క్రమంలో వెల్లడైంది.

మనిషి రక్తంలో ఈ విధంగా ప్లాస్టిక్ రేణువులు ఉండటం వల్ల దీర్ఘకాలిక ప్రభావం మనిషిపై ఏ విధంగా ఉంటుందనేది ఇప్పటికైతే అధ్యయనకారులు నిర్థారించలేదు. ఒక్కొక్కటి 0.2 అంగుళాల వ్యాసార్థంతో ఈ మైక్రోప్లాస్టిక్స్ ఉన్నాయి. రక్తం ఎంతవరకూ కలుషితం కాకుండా ఉంటోంది? ఏదైనా బాహ్య ప్రభావాలకు గురవుతోందా? అనే కోణంలోనే పరిశోధనలు సాగాయి. ఈ దిశలో 22 మంది గుర్తు తెలియని రక్తదాతల రక్తపు నమూనాలను సేకరించారు. వాటిని ల్యాబ్‌లలో పరిశీలించారు. వీటిలో 17 శాంపుల్స్‌లో మైక్రోప్లాస్టిక్స్ ఉన్నట్లు నిర్థారణ అయింది. శీతలపానీయాల తయారీ , ఫుడ్ ప్యాకేజీలు తయారీకి వాడే ప్లాస్టిక్ రేణువులు ఈ శాంపుల్స్‌లో ఇమిడి ఉన్నాయి. రక్తంలో ఈ కాలుష్య పదార్థాలు ఉండటం చాలా ఆందోళనకర విషయం , మనిషి కాలుష్యం మధ్యలో జీవించడమే కాదు మనిషిలోపల కూడా కాలుష్య కారకాలు నెలకొని ఉండటం ఆందోళనకర పరిణామం అని అమ్‌స్టర్‌డమ్‌కు చెందిన పర్యావరణవిషయాల శాస్త్రవేత్త ఎకోటాక్సాలజిస్టు ప్రొఫెసర్ డిక్ వెటాక్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News