Home తాజా వార్తలు అతిపెద్ద డేటా సెంటర్

అతిపెద్ద డేటా సెంటర్

Microsoft to open a data center in hyderabad

 

రాష్ట్రంలో రూ.15వేల కోట్ల పెట్టుబడితో పెట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేసిన మైక్రోసాఫ్ట్
హైదరాబాద్ దగ్గర స్థలం ఎంపిక చేసినట్టు సమాచారం

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో అతిపెద్ద డేటా సెంటర్ రాబోతున్నది. ఇందుకోసం టెక్నాలజీ దిగ్గజమైన మైక్రోసాఫ్ట్ సంస్థ సుమారు రూ.15 వేల కోట్ల పెట్టుబడిని పెట్టేందుకు ప్రణాళికలను సిద్ధం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తుంది. ఈ డేటా సెంటర్ కోసం హైదరాబాద్ సమీపంలో రాష్ట్ర ప్రభుత్వం, మైక్రోసాఫ్ట్ కలిసి ఒక స్థలాన్ని కూడా ఎంపిక చేసినట్లుగా సమాచారం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటి) పరంగా అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోంది. అందులో భాగంగానే మైక్రోసాఫ్ట్ తన డేటా సెంటర్‌ను ఇక్కడ ఏర్పాటు చేయడానికి సిద్దమైందని తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన ప్రకటన త్వరలో అధికారికంగా వెలువడే అవకాశముంది. రిలయన్స్ జియో, మైక్రోసాఫ్ట్ 2019లో భారతదేశంలో డేటా కేంద్రాలను ఏర్పాటు చేయడానికి భాగస్వామ్యం ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఆ ఒప్పందంలో భాగంగానే జియో నెట్‌వర్క్ ద్వారా మైక్రోసాఫ్ట్ తమ క్లౌడ్ టెక్నాలజీ అయిన అజూర్ క్లౌడ్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ నేపథ్యంలో కెనడాకు చెందిన డిజిటల్ రియాల్టీ అనుబంధ సంస్థ బ్రూక్ ఫీల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ తో మైక్రోసాఫ్ట్ ఒప్పందం చేసుకుంది. బిఎఎమ్ రియాల్టీ బ్రాండ్ పేరుతో భారతదేశంలో డేటా సెంటర్లను ఏర్పాటు చేయడానికి జాయింట్ వెంచర్ ను రూపొందించినట్లు తెలిపింది. 2024 కల్లా భారత్‌లో డేటా సెంటర్ల ఆదాయం 4 బిలియన్ డాలర్లకు చేరుకోనున్నట్లు ప్రాక్సిస్ గ్లోబల్ అలయన్స్ నివేదిక విడుదల చేసింది. ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ సంస్థ హైదరాబాద్‌లో త్వరలో తన స్పెషలైజ్డ్ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వంతో తుది విడత చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. ఇది వాస్తవరూపం దాల్చినట్లయితే రాష్ట్రంలో ఉపాది అవకాశాలు మరింతగా పెరగనున్నాయి.

Microsoft to open a data center in hyderabad