Home లైఫ్ స్టైల్ మహిళల్లో పార్శ్వపు నొప్పి

మహిళల్లో పార్శ్వపు నొప్పి

headache ప్రస్తుత తరుణంలో క్షణం తీరిక లేని జీవనం, నిత్యం పరుగులు, సమయానుకూలంగా నిద్ర, ఆహారం లేక.. నిలకడ లేని ఆలోచనలతో యంత్రాలతో పరిగెడుతూ.. తీవ్ర మానసిక ఒత్తిడికి గురి అవుతున్నారు. ఇలాంటి ఒత్తిడి వల్ల వచ్చే వ్యాధుల్లో ముఖ్యమైనది పార్శ్వపు నొప్పి దీనినే వైద్య పరిభాషలో మైగ్రేన్ అంటారు. నేడు పార్శ్వపు నొప్పితో ఎక్కువగా బాధపడుతున్నవారి లో అధికం మహిళలే. దీనికి గల కారణం అంతర్గత మానసిక ఒత్తిడితో పాటు అధిక పని భారం. పార్శ్వపునొప్పి వల్ల ఏ పని సరిగా చేయలేక అంతర్గతంగా మదన పడి మానసిక వ్యాధులకు సైతం గురిఅవుతున్నారు.   కొందరిలో తలనొప్పి ఒకే వైపుకు వచ్చి వేధించును. ఇలాంటి తల నొప్పిని పార్శ్వపు నొప్పి (మైగ్రేన్) అంటారు. ఈ నొప్పి తీవ్రత క్రమంగా పెరిగి క్రమంగా తగ్గును. నొప్పి భరించ లేకుండా వుండి తల దిమ్ముగా ఉంటుంది.

తల నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు చిరాకు, కోపం ఎక్కువగా ఉండి ఏ పని చేయడం కుదరదు. దీంతోపాటు వాంతికి వచ్చినట్లుగా అనిపించడం, శబ్దాలు భరించలేక పోవటం, వెలుతురును సరిగా చూడలేక పొవుట, కళ్లకు చీకటి వచ్చినట్లుగా అనిపించుట వంటి లక్షణాలతో బాధ పడుతుంటారు.
కారణాలు : – అధిక మానసిక ఒత్తిడి వలన మెదడులో కొన్ని రసాయనిక మార్పులు జరిగి మైగ్రేన్ నొప్పి వస్తుంది.
*మెదడు కణాలలో కణుతులు ఏర్పడటం వల్ల కూడా మైగ్రేన్‌నొప్పి వస్తుంది. తలకు గాయాలు తగలడం, కొన్ని సందర్భాల్లో మెదడులో వచ్చే ఇన్‌ఫెక్షన్స్ వల్ల కూడ మైగ్రేన్‌నొప్పి వస్తుంది.
* కంటికి సంబంధించిన వ్యాధులను నిర్లక్ష్యం చేయడం వల్ల సైతం మైగ్రేన్‌నొప్పి వచ్చి వేధించును.
జాగ్రత్తలు : – మొదటగా మానసిక ఒత్తిడి నివారణకు యోగా, మెడిటేషన్, ప్రాణాయామం నిత్యం చేయాలి ఇలా చేస్తే మానసిక ప్రశాంతత కలిగి మైగ్రేన్‌నొప్పి తీవ్రత తగ్గుతుంది.
* మైగ్రేన్‌నొప్పి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు శబ్దాలు లేని చీకటి గదిలో విశ్రాంతి తీసుకోవాలి.
* ఫాస్ట్ ఫుడ్స్, వేపుళ్ళకు స్వస్తి పలికి పౌష్టికరమైన ఆహారం తీసుకోవాలి.
* ఆకుకూరలకు, వెజిటేబుల్స్, తాజా పండ్లు తీసుకోవటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి.
* నీరు అధికంగా తీసుకోవాలి, వేళకు ఆహారం తీసుకుంటూ, సమయానికి నిద్ర పోతూ ఉండాలి. ప్రతి రోజూ వేకువజామున లేచి 45నిముషాలు పాటు నడవటం అలవాటు చేసుకోవాలి తద్వార రక్త ప్రసరణ సక్రమంగా జరిగి మైగ్రేన్‌నొప్పి తీవ్రత తగ్గును.
చికిత్స : పార్శ్వపు తలనొప్పే కదా అని వైద్యం తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే తీవ్రపరిణామాలకు దారి తీయును. హోమియోవైద్యంలో పార్శ్వపు తల నొప్పి(మైగ్రేన్)కి మంచి చికిత్స కలదు. ఈ వైద్య విధానంలో మందును ఎన్నుకునే ముందు వ్యక్తి మానసిక, శారీరక లక్షణాలను, అలవాట్లను పరిగణలోకి తీసుకొని మందును ఎన్నుకోవడం జరుగుతుంది కావున వ్యాధి నివారణ సమూలంగా జరుగుతుంది.
మందులు: సాంగ్వినేరియా : కుడి వైపు వచ్చే పార్శ్వపుతల నొప్పికి ఇది మంచి మందు. తల నొప్పి పోట్లతో కూడి భరించలేకుండా ఉండును. తలనొప్పి వెనుక నుంచి ప్రారంభమై ముందుకు వచ్చి తల కుడివైపు భాగంలో ఎక్కువగా ఉండును. తలనొప్పి వచ్చినప్పుడు వీరు చీకటి గదిలో విశ్రాంతి తీసుకోవటం వల్ల ఉపశమనం పొందుట గమనించదగిన లక్షణం. ఇటువంటి లక్షణాలున్న వారికి ఈ మందు తప్పక ఆలోచించదగినది.
స్పైజీలియా : ఎడమ వైపు వచ్చే పార్శ్వపు తలనొప్పికి ఇది మంచి మందు. తల నొప్పి నుదిటి, కంటి భాగాలలో పోట్లతో కూడి భరించలేకుండా ఉండును. తలనొప్పి వెనుక నుంచి ప్రారంభమై ముందుకు వచ్చి తల ఎడుమ వైపు కణతల భాగములో ఎక్కువగా ఉండును. తలనొప్పి కదిలిన, కుదిపిన ఎక్కువగుట గమనించాల్సిన లక్షణం. ఇటువంటి లక్షణాలున్న వారికి ఈ మందు ప్రయోజనకారి.
కాలీబైక్ : తలనొప్పి ముక్కు మొదట భాగంలో ప్రారంభమవుతుంది. తలనొప్పి వచ్చే ముందు చూపు మసక బారుతుంది, తరచుగా జలుబు చేయడం వల్ల ఇటువంటి పార్శ్వపు తలనొప్పి వస్తుంది. సైనసైటీస్‌తో బాధ పడే వారిలో ఈ నొప్పి ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి లక్షణాలున్న వారికి ఈ మందు వాడాలి.
సైలీషియా : తల వెనుక భాగంలో నొప్పి ప్రారంభమై తల మీదుగా కుడి నుదుటి కంటి భాగంలో ఎక్కువగా ఉంటుంది. నొప్పి తీవ్రత ఎక్కువగా ఉండి తల పగిలి పోతున్నట్లుగా అనిపిస్తుంది. తలనొప్పి వచ్చే ముందు చూపు మసకబారి వస్తువులు సగం వరకే కనిపించుట, అరి కాళ్ళలో అరి చేతులలో చెమటలు ఎక్కువగా ఉండుట గమనించదగిన లక్షణం. నొప్పి ఇంకా ఎక్కువగా ఉన్నప్పుడు శబ్దాలు భరించలేరు. ఇటువంటి లక్షణాలున్న వారికి ఈ మందు తప్పక వాడుకోదగినది.
ఈ మందులే కాకుం డా బ్రయోనియా, జెల్సిమియం, సెపియా, నైట్రోమోర్, కాల్కేరి యా ఫాస్ వంటి మందులను వ్యాధి లక్షణాలను పరిగణ లోకి తీసుకొని ఎన్ను కొని వైద్యం చేస్తే పార్శ్వపు నొప్పి (మైగ్రేన్) నుం చి విముక్తి పొందవచ్చును.