Wednesday, April 24, 2024

వల”సలసల”

- Advertisement -
- Advertisement -

Migrant workers

 

స్వస్థలాలకు వెళ్లేందుకే వలస కార్మికుల పట్టు
హైదరాబాద్ టోలిచౌకి, రామగుండం, అశ్వరావుపేటలో రోడ్డెక్కిన కూలీల ఆందోళనలు
సొంత రాష్ట్రాలకు రైళ్లల్లో పంపించాలని డిమాండ్

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో వలస కార్మికులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. మరోసారి రోడ్డు ఎక్కారు. కడుపులో పెట్టుకుని చూసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ఎంత చెప్పినా ఉపాధి లేకుండా ఉండలేమని, సొంత ఉరుకు వెళ్లుతామని కార్మికులు నిశ్చయించుకున్నారు. రామగుండం, అశ్వారావు పేట,హైదరాబాద్ టోలీ చౌక్‌లో వేలాధి మంది వలసకార్మికులు రోడ్డు ఎక్కి ఆందోళనకు దిగారు. సొంత ఊర్లకు వెళ్లేందుకు రైళ్లు ఏర్పాటు చేయాలని డిమాండ్‌చేశారు. ఈ సందర్భంగా రామగుండం థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణ పనులుకు వచ్చిన ఉత్తరాది రాష్ట్రాల కార్మికులు పనిప్రాంతంలోనే ధర్నాచేశారు. అలాగే అశ్వరావు పేటలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తుని తదితర ప్రాంతాలకు చెందిన కార్మికులు చెక్‌పోస్టు దగ్గర భారీ ధర్నా చేశారు.

హైదరాబాద్ లోని బంజారాహిల్స్, ఆసిఫ్‌నగర్, హుమాయూన్ నగర్ ప్రాంతాల్లో ఉంటున్న సుమారు వేలాది మంది వలసకార్మికులు టోలిచౌక్ దగ్గర ధర్నాచేశారు. వీరిలో అధికంగా బీహర్ జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, కర్నాటక, పశ్చిమ బెంగాల్‌కు చెందినవారు ఉన్నారు. తమ సొంత రాష్ట్రాలకు రైళ్లల్లో పంపించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు వలసకార్మికులకు వాగ్వివాదం జరిగింది. ఇ-పాస్ ఉన్నవారు సొంతరాష్ట్రాలకు వెళ్లే అవకాశం ఉందని ఈసందర్భంగా వెస్ట్‌జోన్ డిసిపి ఎఆర్. శ్రీనివాస్ వివరించారు. దశవారీగా పాస్‌లు ఇచ్చి వలస కార్మికులను సొంత రాష్ట్రాలకు చేర్చుతామని ఆయన ఇచ్చిన హామీతో ఆందోళన సద్దుమణిగింది. అలాగే నోడల్ అధికారిగా ప్రభుత్వం సందీప్‌కుమార్ సుల్తానియాను కూడా నియమించింది. ఆయన ఫోన్ నంబర్ 7997920008. అయితే కేంద్రంతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న వలసకార్మికుల ఆందోళనలు మాత్రం ఆగడంలేదు.

రైల్వేది రహస్య ఎజెండా…
ఆందోళనలో వలస కార్మికులు
దేశవ్యాప్తంగా వలసకూలీలను వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు రైల్వేశాఖ పటిష్టమైన చర్యలను చేపట్టింది. అయితే, రైళ్ల వివరాలు బహిరంగంగా ప్రకటించకుండా రహస్యంగా ఉంచడంతో రైల్వేస్టేషన్లలో రద్దీని నియంత్రించ గలుగుతుంది. జిల్లాకలెక్టర్లు, ప్రత్యేక నోడల్ అధికారుల పర్యవేక్షణలో జాబితాలు సిద్ధం చేసి వారిని రైల్వేష్టేషన్‌కు నిర్ణీత సమయంలో పిలిపించి రైలు ఎక్కించి మర్యాదపూర్వకంగా పంపిస్తున్నారు. రైల్వేశాఖ రహస్య మిషన్ మాదిరిగా వ్యవహరిస్తూ రైల్వేస్టేషన్లలో వలసకూలీలు సామాజిక దూరం పాటించే విధంగా చర్యలు చేపట్టి బృందాలుగా ఏర్పాటు చేసి ప్రత్యేక రైళ్లలో పంపిస్తున్నారు. ఈ విషయంలో సంపూర్ణ సమాచారం కూడా రైల్వే అధికారులకు ముందస్తుగా అందడంలేదు. ఫలితంగా వలసకార్మికుల్లో ఆందోళన నెలకొంది. అయితే రైల్వే శాఖ గుంబనంగా వ్యవహరించేందుకు అనేక కారణాల ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుత కరోనా నేపథ్యంలో లక్షలాది వలసకార్మికులు రైల్వేస్టేషన్లలో గుంపులు గుంపులుగా చేరితే లాక్‌డౌన్ లక్ష్యానికి గండిపడే అవకాశాలు అధికంగా ఉండటంతో జాబితాలు రూపొందించి వలసకార్మికులకు సమాచారం అందిస్తున్నారు. రాష్ట్రంలో సుమారు 3 లక్షల మంది గుర్తింపు పొందిన వలస కార్మికులు ఉండగా దేశవ్యాప్తంగా 10 మిలియన్ల వలస కార్మికులు ఉన్నారు. లాక్‌డౌన్ ఎత్తివేసే లోగా ప్రత్యేక చర్యలు తీసుకుని వారిని గమ్యస్థానాలకు చేరిస్తే లాక్‌డౌన్ అనంతరం ప్రయాణికుల ఒత్తిడి తగ్గించవచ్చనే ఎత్తుగడతోనే ఈ పద్ధతిని ప్రవేశపెట్టారు. ఇప్పటికే తెలంగాణ నుంచి 1239 వందల మందిని జార్ఘండ్, ఒడిశా, గుజరాత్ కు చేర్చారు. దేశంలో తొలి రైళ్లు తెలంగాణ నుంచే ప్రారంభం కావడం గమనార్హం. రైల్వే శాఖ మరికొన్ని రైళ్లను కూడా ఏర్పాటు చేస్తుంది. అయితే రైల్వే శాఖ కోవిద్ 19 రహస్య ఎజెండాగా ఈ ప్రయాణాలను ఏర్పాటు చేసిందని పలువురు చెపుతున్నారు. అలాగే ఇతర రాష్ట్రాలు కూడా ఇదే విధానంతో వలస కార్మికులను గమ్యస్థానాలకు చేర్చుతున్నారు.

 

Migrant workers are serious Concern
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News