Friday, March 29, 2024

లక్షమంది వలస కార్మికుల తరలింపు

- Advertisement -
- Advertisement -
Migrant-Workers, Migrant Workers Evacuation in India
115 ప్రత్యేక రైళ్లలో వారి సొంత రాష్ట్రాలకు చేర్చాం : రైల్వే

న్యూఢిల్లీ : లాక్‌డౌన్ వల్ల ఇతర రాష్ట్రాలలో చిక్కుకుపోయి తమ సొంత రాష్ట్రాలకు వెళ్లాలనుకుంటున్న వలస కార్మికుల కోరిక నెరవేరుతోంది. బుధవారం తెల్లవారుజాము వరకు శ్రామిక రైళ్ల ద్వారా లక్షమంది వలస కార్మికుల్ని వారి సొంత రాష్ట్రాలకు చేర్చినట్టు రైల్వేశాఖ తెలిపింది. మే 1 నుంచి ఇప్పటివరకూ 115 ప్రత్యేక రైళ్లలో వారిని తమ గమ్యస్థానాలకు చేర్చామని తెలిపింది. బుధవారం 42 ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించగా, ఇప్పటికే 22 వెళ్లాయని మిగతా 20 రైళ్లు రాత్రి బయలుదేరుతాయని రైల్వే అధికారులు తెలిపారు. కేంద్ర హోంశాఖ అనుమతితో వలస కార్మికుల తరలింపు కోసం రైల్వేశాఖ ‘శ్రామిక రైళ్ల’ పేరుతో ప్రత్యేక ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే.

ఒక్కో ప్రత్యేక రైలులో 24బోగీలుంటాయి. ఒక్కో బోగీలో 72 సీట్లుంటాయి. అయితే, భౌతిక దూరం పాటించాలన్న నిబంధన వల్ల 54 మందికే అనుమతిస్తున్నారు. మంగళవారం ఉదయం వరకు గుజరాత్ నుంచి ౩5, కేరళ నుంచి 13 రైళ్లు వలస కార్మికుల్ని తమ సొంత రాష్ట్రాలకు తీసుకెళ్లాయి. తమ రాష్ట్రానికి చెందిన కార్మికులతో వచ్చిన 13 రైళ్లను బీహార్ ప్రభుత్వం స్వీకరించింది. మరో 11 రైళ్లు ఇతర రాష్ట్రాల నుంచి అక్కడికి వెళ్తున్నాయి. మరో ఆరు అక్కడికి వెళ్లేందుకు అనుమతి లభించింది. ఉత్తర్‌ప్రదేశ్ ఇప్పటికే తమ రాష్ట్రానికి చెందిన కార్మికులతో కూడిన 10 రైళ్లను స్వీకరించింది. మరో 5 వెళ్తున్నాయి. ఇంకో 12 రైళ్లకు అనుమతి లభించింది.

బెంగాల్ ప్రభుత్వం రాజస్థాన్ నుంచి ఒక రైలుతోపాటు కేరళ నుంచి మరో రైలు తమ రాష్ట్ర కార్మికులతో రావడానికి అనుమతించింది. జార్ఖండ్‌కు ఇప్పటికే నాలుగు రైళ్లు చేరుకున్నాయి. మరో ఐదు మార్గంలో ఉండగా, ఇంకో రెండింటికి అనుమతి లభించింది. తెలంగాణలో పని చేస్తూ లాక్‌డౌన్ వల్ల ఇక్కడ చిక్కుకుపోయిన జార్ఖండ్ కార్మికుల్ని ఇప్పటికే అక్కడికి చేర్చిన విషయం తెలిసిందే. ఒడిషాకు ఇప్పటికే ఏడు రైళ్లు వలస కార్మికులను చేర్చగా, ఐదు మార్గమధ్యంలో ఉన్నాయి. మరొకదానికి అనుమతి లభించింది.

migrant workers evacuation in india

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News