Friday, March 29, 2024

మిలిటెంట్లు, భద్రతా బలగాల మధ్య కాల్పులు

- Advertisement -
- Advertisement -

Militants attack Assam Rifles camps

గౌహతి: ఈశాన్య ప్రాంతంలోని భారత్-మయన్మార్ సరిహద్దులో మంగళవారం రెండు చోట్ల ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య భారీ ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ప్రాంతంలోని మిలిటెంట్ గ్రూపులు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను బహిష్కరించాలని పిలుపునిచ్చిన కొద్ది రోజుల తర్వాత ఇది జరిగింది. మొదటి ఘటన అరుణాచల్ ప్రదేశ్‌లోని పాంగ్‌సౌ పాస్ సమీపంలో చోటుచేసుకుంది. తిరప్ చాంగ్లాంగ్ ప్రాంతంలో ఈరోజు తెల్లవారుజామున భారత్-మయన్మార్ సరిహద్దులో అస్సాం రైఫిల్స్ సిబ్బందిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.  దీంతో స్పందించిన అస్సాం రైఫిల్స్‌ సిబ్బంది ఉగ్రవాదులపై కాల్పులు జరిపారు. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపింది. ఒక జూనియర్ కమీషన్డ్ అధికారి చేతికి స్వల్ప గాయమైందని ప్రకటనలో వెల్లడించింది. దాడికి పాల్పడిన ఉగ్రవాదుల ఆచూకీ కోసం భద్రతా బలగాలు అంతర్జాతీయ సరిహద్దు దగ్గర భారీ ఆపరేషన్ ప్రారంభించాయి. పాంగ్సు పాస్ ప్రాంతం అరుణాచల్ ప్రదేశ్‌లోని అత్యంత మారుమూల ప్రాంతాలలో ఒకటి. ఈశాన్య ప్రాంతంలోని చాలా తిరుగుబాటుదారుల సమూహాలు మయన్మార్ అడవుల్లో తమ శిబిరాలను కలిగి ఉన్నాయని అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News