Saturday, April 20, 2024

కొవిడ్ నుంచి కోలుకున్న మిల్కా సింగ్

- Advertisement -
- Advertisement -

milkha singh recovered from coronavirus

చండీగఢ్ : భారత దిగ్గజ అథ్లెట్ మిల్కా సింగ్ కరోనా నుంచి కోలుకున్నాడు. కొన్ని రోజులుగా మిల్కా సింగ్ అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. కరోనాతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు వెంటాడడంతో మిల్కా సింగ్‌ను ఐసిసిలో ఉంచి చికిత్స అందించాడు. ప్రస్తుతం మిల్కా సింగ్ పూర్తిగా కోలుకున్నట్టు కుటుంబ సభ్యులు ఒక ప్రకటనలో వెల్లడించారు. ఆరోగ్యం కుదుట పడడంతో మిల్కా సింగ్‌ను ఐసియు నుంచి సాధారణ వార్డుకు తరలించారు. మరి కొన్ని రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉంచి చికిత్స అందిస్తామని వైద్యులు తెలిపారు. ఇదిలావుండగా కష్ట కాలంలో తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి మిల్కా సింగ్ కృతజ్ఞతలు తెలిపాడు.

milkha singh recovered from coronavirus

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News