Home రాష్ట్ర వార్తలు కోటి ఎకరాలకు విధిగా నీరు

కోటి ఎకరాలకు విధిగా నీరు

మంచిర్యాల జిల్లా గూడెం ఎత్తిపోతల ప్రారంభం సందర్భంగా మంత్రి హరీశ్‌రావు పునరుద్ఘాటన 

Harishదండేపల్లి : కోటి ఎకరాల మా గాణికి సాగునీరు అందించడమే సిఎం కెసిఆర్ ఆశయమని, ఆ దిశగా ప్రాజెక్టుల నిర్మాణం చేప డుతున్నామని నీటిపారుదల శాఖమంత్రి హరీశ్ రావు వెల్లడించారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం సత్యనారాయణస్వామి ఎత్తి పోతల పథకం నీటిని రెండో పంటకు మంగళ వారం తానిమడుగు ప్రధాన కాలువలోకి విడుద ల చేశారు. ముందుగా పూజ నిర్వహించి, పుష్పా లు చల్లి సాగునీటిని వదిలారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.600 కోట్లు ఖర్చు చేసి, నిర్మాణం పూర్తి చేసిందన్నారు.

ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణంతో ముంపునకు గురైన భూ నిర్వాసితులకు రూ.102 కోట్ల ఆర్థిక సాయం అందించి రైతులను ఆదుకున్నామన్నారు. కాంగ్రెస్ నాయకులు ప్రాజెక్టులను అడ్డుకోవడ మే లక్షంగా ఎంచుకున్నారని, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టుల నిర్మాణ పనులను చూసి ఓర్వలేకే కోర్టులలో కేసులు వేస్తున్నారని, అలాంటి వారికి రైతులే బుద్ధి చెబుతారన్నారు. కాళేశ్వరం, ప్రాణహిత ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయితే ఉత్తర తెలంగాణ ఆకుపచ్చ తెలంగాణ మారి పంటలతో సస్యశ్యామలంగా మారుతుందన్నారు.  ఎల్లంపల్లి ప్రాజెక్టులో 2014లో ఐబి టిఎంసిల నీరు నిల్వ కాగా2015లో 10టిఎంసిలు, 2016లో 21 టిఎంసిల నీటిని నిల్వ చేసిన ఘనత  ముఖ్యమంత్రి కెసిఆర్‌దేనని ఆయన తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన చోట రైతులు  భూసేకరణకు సహకరించా లని ఆయన  కోరారు.

ప్రాజెక్టు నిర్మాణం పూర్త యితే  గోదావరిలో  పుష్కలంగా నీరు ఉంటుం దని, గోదావరి రెండు వైపుల పంటలు పండించు కోవచ్చునని  రైతులకు భరోసా ఇచ్చారు.  టిఆర్ ఎస్ ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలలో 8 కంది ధాన్యం కొనుగోలు కేంద్రాలను  ఏర్పాటు చేసి, రైతులకు మద్దతు ధర అందిస్తుందన్నారు.  రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం పాటుపడుతుందని ఆయన గుర్తు చేశారు. గూడెం గ్రామంలోని రైతులకు  సాగునీరు అందించేందుకు  ప్రత్యేక ఎత్తి పోతల పథకం నిర్మాణంకు  కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కుం టాల గ్రామానికి,  వంతెన నిర్మా ణానికి నిధులు ,ధర్మరావుపేట చెక్‌డ్యాం, కడెం కాల్వల సిమెంట్ లైనింగ్ నిర్మాణ పనులకు నిధుల మంజూరుకు  సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకెళ్లనున్నా మన్నారు.  అనంతరం పెద్దపల్లి ఎంపి బాల్క సుమన్ మాట్లా డుతూ 40 ఏళ్లు పాలన చేసిన కాంగ్రెస్ ప్రజలకు చేసింది శూన్యమని, ప్రాజెక్టుల పేరుతో కమీషన్లు దండుకొని కోట్లకు పడిగెత్తారని  ఆరోపించారు.

 రెండున్నరేళ్ల టిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో  45 వేల చెరువులకు మిషన్ కాక తీయ ద్వారా  మర మ్మతులు చేపట్టడం జరిగింద న్నారు.  కాంగ్రెస్ నాయకులు అభివృద్ధిని చూసి ఓర్వలేక  దుష్ప్ర చారం చేయడం  సిగ్గు చేటని ఆయన దుయ్య బట్టారు.  రైతుల కళ్లలో ఆనందం చూడడమే  సిఎం కెసిఆర్ లక్షమని , దీని కోసం ప్రాజెక్టుల నిర్మాణానికి  అధిక ప్రాధాన్యత ఇచ్చి  నిధులు మంజూరు చేస్తున్నాడన్నారు. తెలిపారు. పలు గ్రామాల ప్రజలు తమ సమస్యలు పరిష్కరిం చాలని  మంత్రికి వినతి పత్రాలు  ఇచ్చారు.   అటవీశాఖ మంత్రి జోగురామన్న,  ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు, మంచిర్యాల, బెల్లంపల్లి ఎఎంల్ ఏలు, దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య,  ఎంఎల్‌సి పురాణం సతీష్, కలెక్టర్ ఆర్‌వి కర్ణన్, మాజీ ఎంఎల్‌ఏ గోవింద్‌నాయక్,  జడ్‌పి వైస్‌చైర్మన్ రాజి రెడ్డి,  డిసిఎంఎస్ చైర్మన్ శ్రీ నివాస్‌రెడ్డి,  ఎంపిపిలు గొల్ల మంజూల, బేర సత్యనారాయణ, కట్ల చంద్రయ్య, వైఎస్ ఎంపిపి రాజేందర్,  సింగిల్ విండో చైర్మన్ గడ్డం శ్రీనివాస్, జడ్‌పిటిసిలు యశ్వంత్ నాయక్,  చుంచు చిన్నయ్య,  తహసీ ల్దార్ శ్యామలాదేవి, ఎంపిడిఓ శ్రీనివాస్,   మాజీ ఎంపిపిలు గురువయ్య, మల్లేష్, ఆయా శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు.