Tuesday, April 23, 2024

కొలువులను కబళిస్తున్న కరోనా

- Advertisement -
- Advertisement -

corona

 

ప్రపంచవ్యాప్తంగా కార్మికులు కరోనా వైరస్ సృష్టించిన ఆర్ధికమాంద్యం వల్ల విలవిలలాడుతున్నారు. లక్షలాది ఉద్యోగాలు గల్లంతయ్యాయి. సంక్షేమ కార్యక్రమాలకు పుల్ స్టాప్ పడింది. వైరస్ ను అదుపు చేయకపోతే దాదాపు 2 కోట్ల 23 లక్షల కంపెనీలు మూతపడతాయని అంతర్జాతీయ కార్మిక సంస్థ ప్రకటించింది. ఆస్ట్రియా నుంచి అమెరికా వరకు ప్రభుత్య వ్యయంలో కోతలు పెరిగిపోయాయి. 1930 తర్వాత శాంతి కాలంలో ఎన్నడూ లేనంత తీవ్రమైన ఆర్ధికమాంద్యం ఇప్పుడు నెలకొంది. పలుదేశాల ఆర్ధికవ్యవస్థలు ఈ మహమ్మారి కారణంగా కుదేలయ్యాయి.

అమెరికా, యూరపుల్లో నిరుద్యోగం పెరుగుతోంది. ఇలాంటి సంక్షోభం గతంలో ఎన్నడూ లేదని నిపుణులు అంటున్నారు. నిరుద్యోగం పెరిగితే ప్రభుత్వాలపై ఒత్తిడి పెరుగుతుంది. వివిధ దేశాల్లోని కేంద్ర బ్యాంకులపై కూడా ఒత్తిడి పెరుగుతుంది. మహమ్మారిని అదుపు చేయడానికి లాక్ డౌన్లు ప్రకటించినందువల్ల కార్మిక శక్తి నిరుపయోగంగా, నిరుత్పాదకంగా మిగిలిపోయింది. అయినా వారికి జీతభత్యాలు చెల్లించక తప్పదు. అనేక కంపెనీలు నష్టాలను భరించక తప్పని పరిస్థితి తలెత్తింది.

ఈ పరిస్థితుల్లో విధాన పరమైన నిర్ణయాల్లో వైఫల్యం మరింత తీవ్రమైన ఆర్ధికపరిస్థితిని సృష్టిస్తుంది. ప్రభుత్వాలు మరిన్న సంక్షేమ చర్యలు తీసుకోవలసి వస్తుంది. జెపి మోర్గాన్ చేస్ అండ్ కంపెనీ ఆర్దికవెత్తల ప్రకారం అభివృద్ధి చెందిన దేశాల్లో నిరుద్యోగం 2.7 శాతం పెరిగే అవకాశాలున్నయి. ఈ సంవత్సరం మొదటి ఆరునెలల్లోనే ఈ నిరుద్యోగ సమస్య ఎదురు కావచ్చు. నిజానికి ఈ సంవత్సరం ప్రారంభం నుంచే నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. గత నాలుగు దశాబ్దాలుగా ఎన్నడూ లేనంత తీవ్రస్థాయిలో నిరుద్యోగసమస్య ఉన్నప్పుడే ఈ కరోనా కూడా వచ్చింది. ఈ సమస్య నుంచి బయటపడి ఆర్ధికవ్యవస్థ పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. కాని, 2021 నాటికి అమెరికాలో 4.6 శాతం నిరుద్యోగం, యూరపులో 8.3 శాతం నిరుద్యోగం పెరుగుతుందిన ఆర్ధికవేత్తలు హెచ్చరిస్తున్నారు.

వివిధ దేశాల్లో ఈ పరిణామాలు వేర్వేరుగా ఉండవచ్చు. అమెరికాలో స్వేచ్చావిపణి విధానాల వల్ల ఉద్యోగాలు మరింత ఎక్కువ సంఖ్యలో కోల్పోవచ్చు. యూరపు, జపాన్ కన్నా అమెరికాలో ఉద్యోగాల నష్టం ఎక్కువగా ఉండవచ్చు. ఈ ఆర్ధికసంక్షోభం ఒక కుదుపు వంటిది. అమెరికాలో పరిస్థితి అక్కడి నెలసరి కార్మిక నివేదికలో స్పష్టంగా తెలుస్తోంది. గత దశాబ్దకాలంగా ఎన్నడూ లేని స్తాయికి ఉద్యోగకల్పన పడిపోయింది. ఎకనమిస్ట్ అంచనాలకు మించి, అంచనాల కన్నా ఏడు రెట్లు ఎక్కువగా పే రోల్స్ 7,00,000 కన్నా ఎక్కువగా తగ్గిపోయాయి. ఈ గణాంకాలు మార్చి ప్రారంభం నాటివి. అంటే కరోనా విజృంభించడం ప్రారంభమైన కాలం నాటివి. అంటే కంపెనీలు, వ్యాపారసంస్థలు మూతపడడం ప్రారంభం కావడానికి ముందు నాటివి.

నిరుద్యోగ భృతి కోసం ధరఖాస్తు చేసుకుంటున్న అమెరికా పౌరుల సంఖ్య గతవారం 66 లక్షల యాభైవేలకు చేరుకుంది. అంతకు ముందు వారం కన్నా ఇది రెట్టింపు. రెండు వారాలు కలిపి 99 లక్షల 60 వేల మంది నిరుద్యోగభృతి కోసం ధరఖాస్తు చేసుకున్నారు. 2007 నుంచి 2009 వరకు ఆర్ధికమాంద్య కాలంలో మొదటి ఆరునెలల్లో కూడా ఇంత మంది నిరుద్యోగభృతి కోసం ధరఖాస్తు చేసుకోలేదు. గోల్ మ్యాన్ సాచ్ గ్రూపు ప్రకారం అమెరికాలో నిరుద్యోగం 15 శాతం పెరుగుతుంది.

యూరపులోను పరిస్థితి ఇలాగే ఉంది. దాదాపు పదిలక్షల మంది బ్రిటీషు పౌరులు సంక్షేమ చెల్లింపుల కోసం గత రెండు వారాల్లో ధరఖాస్తు చేసుకున్నారు. ఇది అంతకు ముందు కన్నా రెట్టింపు. బ్రిటన్ లో వివిధ వ్యాపార సంస్థలు 27 శాతం సిబ్బందిని తగ్గించుకున్నాయి. స్పెయిన్ లోను ఇదే పరిస్థితి ఉంది. అభివృద్ధి చెందిన దేశాల్లో అత్యధిక నిరుద్యోగం, అంటే 14 శాతం నిరుద్యోగం ఇక్కడే ఉంది. ఆస్ట్రియాలో రెండవ ప్రపంచయుద్ధం తర్వాత మొదటిసారి నిరుద్యోగం 12 శాతానికి చేరుకుంది.
జర్మనీలో నిరుద్యోగం పెరిగినట్లు మార్చిలో కనిపించలేదు. కాని అమెరికాలో మాదిరిగానే ఇక్కడ కూడా కరోనా ప్రభావం ప్రారంభం కావడానికి ముందు నాటి గణాంకాలివి. కాని తర్వాత వచ్చే డాటాలో ఈ ఉద్యోగాల నష్టం తప్పకుండా కనిపిస్తుందని చాలా మంది వివరించారు. మార్చిలో 4,70,000 కరంపెనీలు ప్రభుత్వ సహాయం కోసం ధరఖాస్తు చేసుకున్నాయి.

ఈ సంఖ్య ఇంకా పెరగవచ్చు. కార్మికుల్లో దాదాపు 20 శాతం కార్మికులకు పనిగంటలు తగ్గిపోయాయి. ఫ్రాన్సులో కూడా ప్రభుత్వ సహాయంతో వ్యాపారసంస్థలు సిబ్బందిని ఉద్యోగాల్లో కొనసాగిస్తున్నాయి. దాదాపు 84 శాతం ఉద్యోగుల జీతాలను ప్రభుత్వమే భరిస్తోంది. దాదాపు నాలుగు లక్షల కంపెనీలు 40 లక్షల సిబ్బంది జీతాల కోసం ప్రభుత్వానికి ధరఖాస్తులు చేసుకున్నాయి. అంటే ప్రయివేటు రంగంలోని 20 శాతం కార్మికుల జీతాలు ఇప్పుడు ప్రభుత్వమే భరించవలసి వస్తుంది. నార్డిక్ డాటా కూడా ఇక్కడ నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని తెలియజేస్తోంది. 8 లక్షల కన్నా ఎక్కువ మంది ఉద్యోగాలను కోల్పోయారు. ఫిన్లాండ్, నార్వే దేశాల్లో 6,20,000 మంది తాత్కాలిక ఉద్యోగాల్లో కొనసాగుతున్నారు. ఆసియా విషయానికి వస్తే జపాన్ లో నిరుద్యోగం ఫిబ్రవరి నాటికి 2.4 శాతం ఉంది.

కాని ఇప్పుడు క్రింది స్థాయి ఉద్యోగాల్లో భర్తీలను పూరించడం తగ్గించారు. క్రింది స్థాయి ఉద్యోగాలు తగ్గిపోయాయి. పైగా చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. అనేకమంది జీతాలు కోతకు గురయ్యాయి. ఇలాంటి వారంతా ఇప్పుడు ప్రభుత్వ పథకాల ద్వారా రుణాల కోసం ధరఖాస్తులు చేసుకున్నారు. థాయ్ లాండ్ లో 2 కోట్ల 30 లక్షల మంది ప్రభుత్వ నగదు సహాయం కోసం ధరఖాస్తు చేసుకున్నారు. మార్చి 28 నుంచి ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఈ గ్రాంటులు కేవలం 90 లక్షల మందికి మాత్రమే ఇస్తారు. ప్రతి ఒక్కరికి 455 డాలర్లు ఇస్తారు.

చైనా ఆర్ధికవ్యవస్థ పుంజుకుంటోంది. ఫిబ్రవరిలో వ్యాపారాలు షట్ డౌన్ అయ్యాయి కాబట్టి నిరుద్యోగం 6.2 శాతానికి పెరిగింది. దాదాపు 80 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. అయితే వైరస్ ను కట్టడి చేయడంలో విజయాల తర్వాతి నుంచి మళ్ళీ ఆర్ధికవ్యవస్థ పుంజుకోవడం ప్రారంభమైంది. పరిస్థితి మరీ నిరాశజనకంగా ఏమీ లేదని ఆర్ధికవేత్తలు హామీ ఇస్తున్నారు. వైరస్ నెమ్మదించిన తర్వాతి నుంచి మళ్ళీ డిమాండ్ పుంజుకుంటుందని, దాంతో పాటు మళ్ళీ ఆర్థికవ్యవస్థలు గాడిలో పడతాయని అంటున్నారు. ఆర్థికవ్యవస్థలు పట్టాలపైకి వస్తే నిరుద్యోగ సమస్య కూడా పరిష్కారమవతుందని భరోసా ఇస్తున్నారు.

 

Millions of jobs lost with corona
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News