Home తాజా వార్తలు నువ్వు స్టెప్పేస్తే ‘మైండ్ బ్లాక్..’

నువ్వు స్టెప్పేస్తే ‘మైండ్ బ్లాక్..’

 

‘మహర్షి’ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ చిత్రంలో మహేస్ సరసన తొలిసారి యంగ్ బ్యూటీ రష్మిక మందాన నటిస్తోంది. కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో అలనాటి లేడీ మెగాస్టార్ విజయశాంతి ఓ కీలక పాత్ర పోషిస్తుంది. దిల్ రాజు, రామబ్రహ్మం సుంకరతో కలిసి మహేష్  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్ రికార్డు వ్యూస్ సాధించింది. తక్కువ సమయంలోనే 10 లక్షల వ్యూస్ సాధించిన తెలుగు సినిమాగా సరికోత్త రికార్డు నెలకొల్పింది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘మైండ్ బ్లాక్..’ అనే పాటను చిత్రయూనిట్ విడుదల చేసింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ పాట పక్కా మాస్ బీట్ తో అభిమానులను ఆకట్టుకుంటోంది. కాగా, ఈ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేసేందుకు చిత్రయూనిట్ ప్లాన్ చేస్తున్నారు.

Mind Block.. song release from Sarileru Neekevvaru