Home తాజా వార్తలు మినీ పేకాట క్లబ్ : నిర్వాహకురాలి భర్త అరెస్ట్

మినీ పేకాట క్లబ్ : నిర్వాహకురాలి భర్త అరెస్ట్

Mini Gambling Centre

హైదరాబాద్: బర్కత్‌పురలో మినీ పేకాట క్లబ్ లో పేకాట ఆడుతున్న 7 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి దగ్గరి నుంచి రూ. 11,670 నగదును సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 3 నెలలుగా కాచిగూడకు చెందిన మహిళ, భర్త తో కలిసి బర్కత్‌పురలోని శాలిని దవాఖాన ముందున్న స్కిల్ లెజెన్సీ అపార్టుమెంట్‌లో ఫ్లాట్‌ను కిరాయికి తీసుకొని మినీ పేకాట క్లబ్బు నిర్వహిస్తున్నారు. స్థానికులు సమాచారంతో సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఈ క్లబ్‌పై దాడి చేసి నిర్వాహకురాలి భర్త హరిబాబుతో పాటు ఫంటర్లు హిమా న్షు శర్మ, కార్తీక్, బిట్ల సంజయ్, శ్రీకాంత్, ప్రేమ్ హరిరాజ్‌లను అరెస్టు చేశారు, ప్రధాన నిర్వాహకురాలైన సరోజ్ పరారీలో ఉందని డిసిపి రాధాకిషన్‌రావు తెలిపారు. నిందితులను తదుపరి విచారణ కోసం కాచిగూడ పోలీసులకు అప్పగించారు.

Mini Gambling Centre Racket Busted in Barkatpura

telangana latest news