Home తాజా వార్తలు రేపు మల్లేపల్లి ఐటిఐ క్యాంపస్‌లో మినీ జాబ్‌మేళా

రేపు మల్లేపల్లి ఐటిఐ క్యాంపస్‌లో మినీ జాబ్‌మేళా

ini Jobmela

 

హైదరాబాద్ : జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులకు ప్రైవేటు రంగంలో ఉద్యోగాలను కల్పించుటకు ఈనెల 16న మల్లేపల్లి ఐటిఐ క్యాంపస్‌లో మినీ జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి మైత్రిప్రియ తెలిపారు. సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ కేఫే కాఫీడే, డోమినోపిజ్జా, పయనీర్‌ఇ లాబ్స్, కోన ఇ డేటా సొల్యూషన్స్, ప్యూచర్ లైప్ స్టైల్ ఫాషన్ లిమిటెడ్ మొదలుగు 05 ప్రైవేటు కంపెనీలలో పనిచేయుటకు 300 ఉద్యోగాలకు ఎంపిక కోసం జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

పదోతరగతి, ఇంటర్, డిగ్రీ చదివిన అభ్యర్ధులకు డెలివరీ బాయ్స్, జూనియర్ కిచెన్ ఎగ్జిక్యూటివ్, ఆదార్ ఆపరేటర్, క్యాషియర్, ఫ్యాషన్ కన్సల్టంట్స్, హెల్పర్, సేల్స్ ఎగ్జిక్యూటివ్, కస్టమర్ సపోర్టు ఎగ్జిక్యూటివ్ మొదలగు ఉద్యోగాల కోసం ఎంపిక చేస్తామన్నారు. ఎంపికైన వారికి నెలకు వేతనాలు రూ.9వేలు నుండి రూ.18వేలు ఇస్తామని, అభ్యర్ధుల వయస్సు 18నుండి 35సంవత్సరాలు గల పురుషులు, స్త్రీలు దరఖాస్తు చేసుకోవాలన్నారు. అసక్తిగల యువకులు తమ బయోడేటాతో పాటు విద్యార్హతల సర్టిఫికెట్లు జిరాక్స్ కాఫీలతో ఉదయం 10.30గంటలకు జాబ్‌మేళాకు హాజరుకావాలని కోరారు.

Mini Jobmela at ITI Campus in Mallepally