Home తాజా వార్తలు పూర్థి స్థాయిలో బస్సులను నడిపించాలి: మంత్రి పువ్వాడ

పూర్థి స్థాయిలో బస్సులను నడిపించాలి: మంత్రి పువ్వాడ

హైదరాబాద్: ఆర్‌టిసి సమ్మె కోనసాతున్న సందర్భంగా బుధవారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అజయ్ కుమార్ ఖైరతాబాద్‌లోని రవాణా శాఖ కార్యాలయం నుంచి టెలికాన్ఫరెన్స్ ద్వారా రవాణా సౌకర్యాల ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా 21వ తేదీ నుంచి విద్యాసంస్థలు పున:ప్రారంభం కానుండటంతో 100శాతం బస్సు సర్వీసులను అందుబాటులోకి తెవాలని అదేశించారు. ఈ మేరకు డిపో మేనేజర్లు, ఇతర అధికారులతో మాట్లాడారు.

ప్రజలకు రవాణా సౌకర్యాల ఇబ్బందులు లేకుండా విస్తృతంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా పలు జిల్లాలో విస్తృతంగా బస్సులు నడుపుతున్నా, హైదరాబాద్‌లో 40శాతం బస్సులు మాత్రమే నడుపుతున్నట్లు వివరించారు. ఈ నేపథ్యంలో నగరంలో కూడా 100శాతం బస్సులను నడిపేందుకు చర్యలను చేపట్టాలని సూచించారు. ఈ మేరకు అనుభవజ్ఞలైన డ్రైవర్ల కొరత లేకుండా చర్యలను తీసుకొవాలని అధికారులను అదేశించారు.

Minister Ajay Kumar Teleconference on TSRTC Strike