Home జయశంకర్ భూపాలపల్లి హెల్త్ కేర్ భవనం ప్రారంభం

హెల్త్ కేర్ భవనం ప్రారంభం

Minister Ajmira Chandlal  Start  Health Care Building

మన తెలంగాణ/వెంకటాపూర్ : మండలంలోని జగ్గన్నపేట గ్రామంలో శుక్రవారం రోజున గిరిజన పర్యాటక శాఖ మం త్రి ఆజ్మీరా చందూలాల్ ఆశ్రమ గిరిజన ఉన్నత పాఠశాలలో ఆరోగ్య రక్షణ స్కూల్ హెల్త్ భవనం ప్రారంభించారు. అనంతరం పాఠశాలలో చదువుతున్న  విద్యార్థులకు 33 రకాల పరీక్షలు వైద్యులతో చేయించారు. 60 లక్షలతో అత్యాధునిక సౌకర్యాలతో అంబులెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో విద్య కోసం విద్యార్థులకు గురుకుల పాఠశాలను ఏర్పాటుచేసి విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడం కోసం రాష్ట్రంలో అనేక గురుకుల పాఠశాలను ఏర్పాటుచేశారు. ములుగు డివిజన్ లోనే జగ్గన్నపేట గ్రామంలో మొట్టమొదిటిసారిగా గిరిజన ఆశ్రమ పాఠశాలలో హెల్త్ కేర్ భవనం ప్రారంభించడం జరిగిందన్నారు. ఆశ్రమ పాఠశాలలో నెలకొన్న వైద్య పరీక్షలు విద్యార్థులకు అందిస్తారని వారు చెప్పారు. బాలికల ఆరోగ్య రక్షణ గురించి వివరించారు. విద్యార్థులకు హాస్టల్ లో అన్ని వసతులు కల్పించాలని విద్యార్థులకు ఆశ్రమ పాఠశాలలో చదువు చెబుతున్న విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలని వారు సూచించారు. బండారుపల్లి గ్రామంలో రూ. 2 కోట్లతో వేసిన సిసి రోడ్లను ప్రారంభించారు. రూ.కోటి రూపాయలతో మంజురైన 20 డబుల్ బెడ్ రూం అమలు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ నాలుగేళ్ళలో బండారుపల్లి గ్రామంలో వివిధ పనులకు రూ. కోటి రూపాయలు వెచ్చినట్లు ఆయన తెలిపారు. గత ప్రభుత్వాలు ఏనాడు బండారుపల్లి గ్రామాన్ని పట్టించుకోలేదని ములుగు నియోజక వర్గంలోనే దాదాపు 3 వేల కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ గద్దెల పద్మ, జడ్పీ ప్లోర్ లీడర్ సకినాల శోభన్, మార్కెట్ కమిటి చైర్మన్ డాక్టర్ ఆజ్మీరా ప్రహ్లాద్, తహసిల్దార్ ముల్కనూరి శ్రీనివాస్, ఎంపిడిఓ విజయ స్వరూప్, ఎంపిపి భూక్యా మంజుల మురళి, మండల పార్టీ అధ్యక్షులు గట్టు మహేందర్, నాయకులు కెశెట్టి కుటుంబ రావు, శ్రీనీవాస రెడ్డి, సత్యనారాయణ, బండారుపల్లి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.