Home తాజా వార్తలు పూర్తి కట్టడిలో కరోనా : ఎర్రబెల్లి

పూర్తి కట్టడిలో కరోనా : ఎర్రబెల్లి

Minister Errabelli Comments On Coronaవ‌రంగ‌ల్ : ప్రస్తుతం తెలంగాణలో కరోనా పూర్తి కట్టడిలో ఉందని, అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. మెగా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మాన్ని పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గంలో గురువారం ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడారు. 18 ఏళ్లు నిండిన ప్ర‌తి ఒక్క‌రూ కరోనా టీకా వేయించుకోవాలని ఆయన కోరారు. కరోనా నుంచి ప్రజలను కాపాడాలనే ఉద్దేశంతో తెలంగాణలో ప్రతిరోజు 3 లక్షల మందికి టీకాలు ఇచ్చేందుకు సెష్పల్ డ్రైవ్ చేపట్టాలని సిఎం కెసిఆర్ ఆదేశించారని, ఈ క్రమంలోనే అర్హులైన ప్రతిఒక్కరూ టీకాలు వేయించుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం విధించిన కరోనా నిబంధనలను ప్రతిఒక్కరు పాటించాలని, బయటకు వచ్చినప్పుడు విధిగా సామాజిక దూరం పాటించడంతో పాటు మాస్కులు ధరించాలని ఎర్రబెల్లి ప్రజలను కోరారు.