Tuesday, April 16, 2024

తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష

- Advertisement -
- Advertisement -

Minister Errabelli Dayakar Rao Fires On Central Government

ప్రభుత్వ నిర్ణయం మేరకు ఎదురుచూస్తున్నాం..
రేవంత్‌రెడ్డి పగటివేషాలు మానుకోవాలి
బండి సంజయ్ మాటలకు విలువలేదు
విలేకరుల సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి, ఎంఎల్‌ఎ పెద్ది

వరంగల్: తెలంగాణ రాష్ట్రంపై కేంద్రప్రభుత్వం వివక్షత చూపిస్తుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, నర్సంపేట ఎంఎల్‌ఎ పెద్ది సుదర్శన్‌రెడ్డిలు అన్నారు. బుధవారం హన్మకొండ జిల్లా కేంద్రంలోని మంత్రి దయాకర్‌రావు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి దయాకర్‌రావుతో పాటు ఎంఎల్‌ఎలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా మంత్రి దయాకర్‌రావు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలుపై స్పష్టతను ఇవ్వడం లేదన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రధానమంత్రి మోడీని, కేంద్ర మంత్రులు కలవడానికి అపాయింట్‌మెంట్ అడిగినా వారు ఇవ్వడం లేదన్నారు. కొందరు కేంద్ర మంత్రులను కలిసినప్పటికి ధాన్యం కొనుగోలుపై స్పష్టతను ఇవ్వడం లేదన్నారు. రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతకైనా సిద్ధంగా ఉందన్నారు. సిఎం కెసిఆర్ ఆధ్వర్యంలో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం సమస్య పరిష్కారం కోసం తీవ్రంగా ప్రయత్నించిందన్నారు.

అయినప్పటికి తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతుందన్నారు. కేంద్రంలోని బిజెపి తెలంగాణ హక్కులను కాలరాస్తుందన్నారు. రైతులపై ముసలికన్నీరు కారుస్తున్న పార్టీలు ఢిల్లీలో తమ సత్తాను చాటాలన్నారు. రాజకీయాల కోసం తిరగకుండా ఢిల్లీ మెడలు వంచేందుకు తెలంగాణ ప్రభుత్వానికి సహకరించాలన్నారు. వానాకాలంలో రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామన్నారు. రైతులు సంయమనం పాటించాలన్నారు. రైతు పండించే పంటలకు కనీస మద్దతు ధర కల్పించడానికి వెంటనే చట్టాన్ని రూపొందించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మూడు రైతు నల్ల చట్టాలను రద్దు చేయాలని దేశవ్యాప్తంగా అన్నదాతలు చేసిన పోరాట ఫలితంగా కేంద్రం ఆచట్టాలను ఉపసంహరించుకుందన్నారు. కాంట్రాక్టు వ్యవసాయానికి చట్టబద్ధత కల్పించుట, రైతులు పండించిన పంట ఎక్కడైనా విక్రయించే వీలు కల్పించుట, ఆహార ఉత్పత్తులను ఎంతైనా నిల్వ చేసుకునే వీలు అవకాశాన్ని కల్పించడానికి చేసిన చట్టాలను ప్రధానమంత్రి నరేంద్రమోడి రద్దు చేశారన్నారు.

నల్ల చట్టాల ఉపసంహరణ కోసం అమరులైన 700 మంది రైతుల కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి రూ.3లక్షలు చొప్పున రూ.21 కోట్ల ఆర్థిక సాయాన్ని ఇవ్వనున్నట్లు సిఎం కెసిఆర్ ప్రకటించారన్నారు. మానవతా థృక్పధంతో సిఎం కెసిఆర్ తీసుకున్న నిర్ణయానికి దేశవిదేశాల నుండి ప్రశంసలు అందుతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా రైతు ఉద్యమంలో అమరులైన 700 మంది కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి రూ.25 లక్షలు చొప్పున ఆర్థిక సాయం అందించాలని మంత్రి డిమాండు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో యాసంగిలో పండించే ముడి ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేస్తుందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చెప్తున్నారన్నారు. నిజానికి యాసంగిలో పండిన ధాన్యాన్ని ఉప్పుడు బియ్యంగా మారుస్తారన్నారు. వాటి కొనుగోలుపై స్పష్టత ఇవ్వకుండా ముడిబియ్యం మాత్రమే కొనుగోలు చేస్తామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెప్పడం దేనికి సంకేతమని ప్రశ్నించారు.

భవిష్యత్తులో వానాకాలం, యాసంగిలో ఎంత వరిధాన్యం సాగుచేయాలో కేంద్రం ముందే ప్రకటించాలన్నారు. దానివల్ల రాష్ట్రంలో ఏపంట వేయాలి అనేది రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుందన్నారు. రాష్ట్రంలో రైతుల సమస్యలపై స్పందించాల్సిన పిసిసి రేవంత్‌రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని అతని పగటి వేషాలను మానుకోవాలని మంత్రి దయాకర్‌రావు అన్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తొండి సంజయ్‌గా మాట్లాడుతున్న మాటలకు విలువలేకుండా పోతుందన్నారు. రైతుల సమస్యలపై కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు జాతీయస్థాయి ఉద్యమాలకు కాంగ్రెస్ పూనుకోవాలన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News