Home తాజా వార్తలు ఎంజిఎం ఆస్పత్రిని సందర్శించిన మంత్రి ఎర్రబెల్లి

ఎంజిఎం ఆస్పత్రిని సందర్శించిన మంత్రి ఎర్రబెల్లి

Minister Errabelli Dayakar Rao visiting MGM Hospital

హైదరాబాద్: వరంగల్ ఎంజిఎం ఆసుపత్రిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆకస్మికంగా సందర్శించారు. పిపిఈ కిట్ వేసుకుని కోవిడ్-19 వార్డును పరిశీలించి బాధితులకు అందుతున్న వైద్యసేవలపై ఆరాతీశారు. ఎంజిఎంతో పాటు ప్రభుత్వాసుపత్రిలో మెరుగైన వైద్యం అందిస్తున్నామన్న మంత్రి ఎవరూ అందోళన చెందొద్దని భరోసా ఇచ్చారు. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ నిల్వలు సరిపడా ఉన్నాయన్నారు. 800 పడకలు అందుబాటులో ఉన్నాయని మంత్రి వివరించారు. ఎంజిఎంను పూర్తిస్థాయి కోవిడ్ సేవలకు వినియోగిస్తామని తెలిపారు. పరిస్థితి విషమిండంతోనే మరణాలు సంభవిస్తున్నాయని ఎర్రబెల్లి పేర్కొన్నారు.

Minister Errabelli Dayakar Rao visiting MGM Hospital