Home తాజా వార్తలు బల్దియా ఎన్నికల్లో టిఆర్ఎస్ దే విజయం : ఎర్రబెల్లి

బల్దియా ఎన్నికల్లో టిఆర్ఎస్ దే విజయం : ఎర్రబెల్లి

Minister Errabelli GHMC Elections Campaignహైదరాబాద్‌ : బల్దియా ఎన్నికల్లో టిఆర్ఎస్ ఘన విజయం సాధించడం ఖాయమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ధీమా వ్యక్తం చేశారు. ప్రజల కోసమే పని చేస్తున్న టిఆర్ఎస్ ను ఆదరించాలని ఆయన నగర ప్రజలను కోరారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి ఎర్రబెల్లి మీర్ పేట్ డివిజన్ లో శనివారం విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఏనాడు ప్రజలను పట్టించుకోని బిజెపి, కాంగ్రెస్ లకు ఓటేయడం వల్ల ఎటువంటి లాభం లేదని, అభివృద్ధికి బాటలు వేస్తున్న అధికార టిఆర్ఎస్ నే ఆదరించాలని ఆయన పేర్కొన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో టిఆర్ఎస్ 100 సీట్లకు పైగా గెలిచితీరుతుందని ఆయన స్పష్టం చేశారు. టిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజల్లో చైతన్యం తేవాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తలపై ఉందని ఆయన చెప్పారు. కారు గుర్తుకు ఓటేసేలా ప్రజలను అప్రమత్తం చేయాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు.