Home జనగామ జ‌న‌గామ టిఆర్ఎస్ కార్యాల‌యాన్ని ప‌రిశీలించిన మంత్రి ఎర్రబెల్లి

జ‌న‌గామ టిఆర్ఎస్ కార్యాల‌యాన్ని ప‌రిశీలించిన మంత్రి ఎర్రబెల్లి

Minister Errabelli Inspects Jangaon TRS Officeజనగామ : ప్ర‌తి జిల్లాకు పార్టీ కార్యాల‌యంలో భాగంగా జనగామ టిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందని, అలాగే ఉమ్మ‌డి జిల్లాలో మిగతా జిల్లాల పార్టీ కార్యాల‌యాలు ప్రారంభోత్స‌వానికి సిద్ధమవుతున్నాయ‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ‌ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. ఆయా కార్యాల‌యాల‌ను సిఎం కెసిఆర్, పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ లు ప్రారంభిస్తారని మంత్రి తెలిపారు. జ‌న‌గామ పార్టీ కార్యాల‌యాన్ని మంత్రి ఎర్ర‌బెల్లి శనివారం పరిశీలించారు. పార్టీ కార్యాల‌యాలు ప్రారంభ‌మైతే పార్టీ కార్య‌క‌లాపాల‌న్నీ అందులోనే జ‌రుపుకునే వీలు క‌లుగుతుందని ఆయన పేర్కొన్నారు. పార్టీ శ్రేణుల‌కు కూడా అనుకూలంగా ఉంటుంద‌ని ఎర్రబెల్లి తెలిపారు.  పార్టీ కార్యాల‌యాలను అన్ని సౌకర్యాలతో నిర్మించామని ఆయన స్పష్టం చేశారు.