Home తాజా వార్తలు పాశ్చాత్య కల్చర్‌ మోజులో పడకండి : ఈటల

పాశ్చాత్య కల్చర్‌ మోజులో పడకండి : ఈటల

Minister Etela Rajenderహైదరాబాద్ : పాశ్చాత్య కల్చర్‌ మోజులో పడి భారత సంస్కృతి సంప్రదాయాలను మరచిపోవద్దని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. మాదాపూర్‌ లో సన్‌ మీడియా గ్రూపు ఆధ్వర్యంలో నిర్వహించిన ఇండియన్ లీడర్‌ షిప్‌ అవార్డ్స్‌ -2019  ప్రదాన కార్యక్రమంలో ఈటెల రాజేందర్‌ పాల్గొని మాట్లాడారు. సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందినప్పటికీ, భారత ఆచార వ్యవహారాలను మరిచిపొవద్దని ఆయన పేర్కొన్నారు. హాస్పిటల్స్‌, స్పోర్ట్స్, బిజినెస్, రియల్‌ ఎస్టేట్‌ తదితర విభాగాల్లో ఉత్తమ సేవలందించిన వారికి మంత్రి ఈటల రాజేందర్ అవార్డులు ప్రదానం చేశారు. శాస్త్ర సాంకేతికతను సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగించాలని ఆయన చెప్పారు. సాంకేతికతను  వినాశనానికి ఉపయోగించవద్దని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో  ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి తదితరులు తదితరులు పాల్గొన్నారు.

Minister Etela Rajender Comments On Western Culture