Saturday, April 20, 2024

విపక్ష నేతలు కేసులు వేసి అడ్డుకున్నారు: మంత్రి ఈటెల

- Advertisement -
- Advertisement -

Minister Etela Rajender Meet With 108 Employees

హైదరాబాద్: తెలంగాణ భవన్ లో 108 ఉద్యోగులతో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణలో కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతోందని ఆయన పేర్కొన్నారు. కరోనా బాధితల చికిత్సకు ఎంత ఖర్చయినా ప్రభుత్వమే భరిస్తుందని సిఎం కెసిఆర్ చెప్పారని ఈటెల అన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని సిఎం కెసిఆర్ భావిస్తే.. ప్రతిపక్ష నేతలు కోర్టులో కేసులు వేసి అడ్డుకున్నారని ద్వజమెత్తారు. ఆరోగ్యశాఖలో పనిచేసే ప్రతి వ్యక్తి కూడా మానవత్వంతో పనిచేయాలని సూచించారు. ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేసేందుకు నిరాకరించే ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ప్రజలు జేబుల నుంచి ఒక్కపైసా ఖర్చు చేయకుండా వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి ఈటెల స్పష్టం చేశారు.

Minister Etela Rajender Meet With 108 Employees

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News