Home తాజా వార్తలు వైద్యులకు సెలవులు రద్దు చేశాం

వైద్యులకు సెలవులు రద్దు చేశాం

Etela-Rajender

17 వేలు ఉన్న పడకలను 22 వేలకు పెంచాం
ఫివర్ ఆసుపత్రిలో 25 కౌంటర్లు ఏర్పాటు చేశాం
 ప్రతిపక్షాలు ప్రజలను భయాందో ళనలకు గురి చేస్తున్నాయి
జ్వరాలన్నీ డెంగీ, మలేరియా జ్వరాలు కావు
ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందిస్తున్నాం
అసెంబ్లీలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్

మనతెలంగాణ/హైదరాబాద్ : వాతావరణ పరిస్థితులు, జ్వరాల దృష్ట్యా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యులకు సెలవులు రద్దు చేశామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులతో పాటు మిగతా జిల్లా ఆస్పత్రుల్లో డాక్టర్లకు సెలవులు రద్దు చేశామని తెలిపారు. ప్రభుత్వ వైద్యులు రోగులకు మెరుగైన వైద్యం అందిస్తూ ప్రజలలో విశ్వాసం కల్పిస్తున్నారని చెప్పారు. తెలంగాణ వచ్చే నాటికి రాష్ట్రంలో 17 వేల పడకలు మాత్రమే ఉండేవని, ఆ సంఖ్యను 22 వేలకు పెంచామని వెల్లడించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాలుగు కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటు చేశామని వివరించారు. గురువారం శాసనసభలో వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ పద్దులపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులను కల్పించి, అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల మీద ప్రజలకు నమ్మకం పెరిగిందని పేర్కొన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందిస్తుండడం వల్లనే రోగులు పెరుగుతున్నారని చెప్పారు. ప్రతిపక్ష పార్టీలు ప్రజలను గందరగోళానికి గురి చేయొద్దని కోరారు. రాజకీయాల కోసమే ప్రతిపక్షాలు ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయని మండిపడ్డారు.

జ్వరాలన్నీ డెంగీ, మలేరియా జ్వరాలు కావని తాము ప్రతిరోజూ జ్వరాలపై సమీక్ష నిర్వహిస్తూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని అన్నారు. గతంలో ఉన్న మాదిరిగా మరణాలు లేవని పేర్కొన్నారు. గ్రామాలు అద్దంలాగా ఉండాలనే ఉద్దేశంతో 30 రోజుల ప్రణాళికకు సిఎం కెసిఆర్ చర్యలు చేపట్టారు. అందుకోసం రూ.339 కోట్లు విడుదల చేశారని చెప్పారు. ప్రభుత్వాసుపత్రులకు రోగులు పెరుగుతున్న నేపథ్యంలో ఫీవర్ ఆసుపత్రిలో 6 కౌంటర్లు ఉండగా, వాటిని 25 కౌంటర్లకు పెంచామని చెప్పారు. ప్రభుత్వాసుపత్రుల్లో సాయంత్రం సమయంలో కూడా ఒపి నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలకు ఏ మాత్రం ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రజల్లో విశ్వాసం, భరోసా కల్పించేందుకు వైద్యులను 24 గంటలు డ్యూటీ చేయమని చెప్పామని పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీలను భర్తీ చేస్తున్నామని చెప్పారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద అవయవమార్పిడి వంటి ఖరీదైన శస్త్రచికిత్సలను అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. వ్యాధులకు చికిత్స కంటే నివారణ ముఖ్యమని, అందుకోసం ప్రజలలో వ్యాధుల పట్ల అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రా ల్లో గర్భిణీలకు పోషకాహారం అందిస్తున్నామని చెప్పారు. అన్ని రకాల సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం పెడుతున్నామని పేర్కొన్నారు. చేసే చేతులను, చేసే మనసుకు గా యం చేయొద్దని, ప్రతిపక్షాలు ప్రభుత్వానికి సహకరించాలి అని మంత్రి ఈటల రాజేందర్ కోరారు.
ప్రతి నియోజకవర్గానికి మిని స్టేడియం
రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి ఒక మిని స్టేడి యం అందుబాటులోకి తీసుకువస్తామని క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. క్రీడాకారులు దేశానికి వెన్నుముక లాంటివారని, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. ఆరోగ్యానికి క్రీడలు చాలా అవసరమని వ్యాఖ్యానించారు. శాసనసభలో క్రీడ లు, యువజన సంక్షేమం పద్దులపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు.

minister etela rajender Said canceled holidays for doctors