Home తాజా వార్తలు ఆరోగ్య కార్డులు అన్ని ఆస్పత్రుల్లో పనిచేస్తాయి

ఆరోగ్య కార్డులు అన్ని ఆస్పత్రుల్లో పనిచేస్తాయి

Etela-Rajender

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల్లో ప్రభుత్వ మిచ్చిన ఆరోగ్య కార్డులు పనిచేస్తాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. అలాగే ఆరోగ్యశ్రీ సేవల్లో కూడా ఎలాంటి మార్పులు లేవన్నారు. పేదలకు మెరుగైన వైద్యం అందాలని, రాష్ట్రం బంగారు తెలంగాణ కావాలన్నదే ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రధాన లక్షమన్నారు. శుక్రవారం సచివాలయంలో మంత్రి ఈటెల వైద్యాధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని అన్ని వర్గాల వారికి వైద్య సేవలు, మహిళలకు పౌష్టక ఆహారం ,కెసిఆర్ కిట్స్ లాంటి పథకాలు అందిస్తున్నారన్నారు. మండల స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ఉన్న ఆసుపత్రులు మెరుగు పర్చామన్నారు. అడవుల్లో ఉన్న ఆదివాసులకు, మారుమూల ప్రాంతా ల ప్రజలకు వైద్యం అందించాలనేది ప్రభు త్వం ఉద్దేశ్యమని మంత్రి పేర్కొన్నారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఉన్న వారికి కూడా వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామని మంత్రి ఈటెల తెలిపారు.

వైద్య రంగానికి అధిక ప్రాధ్యానిత్య నివ్వడంలో భాగంగా రాష్ట్రంలో మెడికల్ కాలేజీల్లో సీట్లు కూడా పెంచామన్నారు. సిఎం ఆదేశాల మేరకు కొత్త ప్రొఫెసర్ల వయస్సు కూడా 65 ఏళ్లకు పెంచుతున్నామని వివరించారు. హైదరాబాద్‌లో ఉన్న ఆస్ప త్రుల్లో 3000 పడకలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఉద్యోగులు, జర్నలిస్ట్‌లకు హెల్త్ కార్డుల విషయంలో ఇప్పటికే సిఎం కెసిఆర్ సమీక్ష నిర్వహించారన్నారు. కార్డులు అన్ని ఆసుపత్రు ల్లో పనిచేస్తాయని ఆయన స్పష్టం చేశారు. దంత వైద్యశాలల్లో కూడా త్వరలో నియామకాలు చేపడుతామన్నారు. అనేక జిల్లాల్లో వైద్య కళాశాలలు ఏర్పాటు చేశామన్నారు. ఈ సమావేశంలో సంబంధిత శాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 Minister Etela said Health cards work in all hospitals