Home కరీంనగర్ కెసిఆర్‌ను విమర్శిస్తే సహించం : గంగుల

కెసిఆర్‌ను విమర్శిస్తే సహించం : గంగుల

Minister Gangula Fires on BJP Chief Bandi Sanjayకరీంనగర్ : సిఎం కెసిఆర్‌పై అనుచిత వ్యాఖలు చేస్తే సహించేది లేదని మంత్రి గంగుల కమలాకర్ తేల్చిచెప్పారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు,కరీంనగర్ ఎంపి బండి సంజయ్ తన స్థాయిని మరిచి కెసిఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన మండిపడ్డారు. కరీంనగర్‌లోని 36వ డివిజన్ కార్పొరేటర్ గుగ్గిళ్ల జయశ్రీ మంత్రి గంగుల సమక్షంలో అధికార టిఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడారు. బిజెపి అగ్రనాయకులు కిషన్‌రెడ్డి, లక్ష్మణ్, దత్తాత్రేయ వంటి వారే కెసిఆర్‌ను ఏకవచనంతో విమర్శించలేదని గంగుల పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న కెసిఆర్‌ను విమర్శిస్తే, ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని ఆయన స్పష్టం చేశారు. కరీంనగర్ ఎంపిగా గెలిచిన బండి సంజయ్ ఇప్పటి వరకు అభివృద్ధిపై దృష్టి సారించలేదని, రాజకీయాలు తప్ప ఆయనకు అభివృద్ధి పట్టడం లేదని మంత్రి ధ్వజమెత్తారు. ఇప్పటికైనా తన వైఖరిని మార్చుకోవాలని మంత్రి గంగుల బండి సంజయ్‌కు సూచించారు.