Friday, April 26, 2024

నూతన 33 బిసి గురుకులాలు అక్టోబర్ 11 నుండి ప్రారంభం

- Advertisement -
- Advertisement -

Minister Gangula Review on BC Welfare Department

15 డిగ్రీ కాలేజీల్లో అక్టోబర్ 15 నుండి తరగతులు ప్రారంభం

బీసీల కోసం 310 గురుకులాల్ని కేటాయించిన ముఖ్యమంత్రి కేసీఆర్

ఏకసంఘంగా ఏర్పడిన ఆత్మగౌరవ భవనాల ట్రస్ట్ లకు ఈ నెల 8న పట్టాల ప్రధానం

బీసీ సంక్షేమ శాఖపై మంత్రి గంగుల కమలాకర్ ఉన్నత స్థాయి సమీక్ష

హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ బిసిల కోసం కేటాయించిన నూతన గురుకులాలు, డిగ్రీ కాలేజీల ప్రారంభానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. జిల్లాకు ఒకటి చొప్పున 33 నూతన గురుకులాలు అక్టోబర్ 11 నుండి, నూతన డిగ్రీ కళాశాలలను అక్టోబర్ 15నుండి ప్రారంభించాలని శుక్రవారం రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ నేతృత్వంలో తన నివాసంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో అధికారులను ఆదేశించారు. అత్యున్నత స్థాయి ప్రమాణాలతో వీటిని నెలకొల్పుతున్నామని, స్థలాల గుర్తింపు బాధ్యతను స్థానిక జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకోవాలన్నారు. గతంలో ముఖ్యమంత్రి హమీనిచ్చిన విదంగా హాలియా, దేవరకద్ర, కరీంనగర్, సిరిసిల్లా, వనపర్తితో పాటు పాత జిల్లాల ప్రతిపాదికగా ప్రతీ జిల్లాలో డిగ్రీ కాలేజీలను ప్రారంభించాలన్నారు.

ఈ నూతన గురుకులాలతో మొత్తం బీసీ గురుకులాల సంఖ్య 310కి చేరిందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 41 కులసంఘాలకు 95.25కోట్లు, కోకాపేట, ఉప్పల్ బగాయత్లో వేల కోట్ల విలువైన 87.3 ఎకరాల భూమిని కేటాయించిందని, వీటిలో 24 కుల సంఘాలు ఇప్పటికే ఏకగ్రీవమై పట్టాలు పొందాయన్నారు, మిగతా సంఘాల్లో సైతం ఎకగ్రీవాలు జరుగుతున్నాయని, ఇలా ఏకసంఘంగా ఏర్పడి ఆత్మగౌరవ భవనాలు నిర్మించుకునే వారికి ఈనెల 8న పట్టాలను ప్రధానం చేసేలా ఏర్పాట్లు చేయాలని మంత్రి గంగుల అధికారులకు తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భర్తీ చేస్తున్న 80025 ప్రభుత్వ ఉద్యోగాల కోసం తెలంగాణ బీసీ స్టడీ సర్కిళ్లు మరింత విస్రుతంగా అభ్యర్థులకు సేవలు అందించాలన్నారు. 12 స్టడీ సర్కిళ్లకు అధనంగా అతి త్వరలో మరో 50 స్టడీ సెంటర్ల ద్వారా గ్రూప్స్, డీఎస్సీ, తదితర పోటీ పరీక్షలకు నాణ్యమైన శిక్షణ అందించేలా కృషి చేయాలని సూచించారు. వీటి ద్వారా దాదాపు 25వేల మందికి పైగా నేరుగా లబ్ధి చేకూరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఎంజేపీ సొసైటీ సెక్రటరీ మల్లయ్యబట్టు, బీసీ స్టడీ సర్కిల్స్ డైరెక్టర్ అలోక్ కుమార్, బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు సంద్య, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News