Friday, March 29, 2024

దివ్యాంగుడి దీనగాధకు చలించిన మంత్రి జగదీష్ రెడ్డి..

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్ :  నిరుపేద కుటుంబానికి చెందిన దివ్యాంగుడికి ఇచ్చిన హామీని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అమలు చేసి అండగా నిలిచి ఆ కుటుంబానికి ఆపద్బాంధవుడు అయ్యాడు . సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన షేక్ నజీర్ పాషా జ్యూస్ బండి నడుపుతూ జీవనం కొనసాగించేవాడు. నజీర్ పాషా కు షుగర్ వ్యాధి రావడంతో తన రెండు కాళ్లు తీసివేయడం జరిగింది. నిమ్స్ లో ఆపరేషన్ సమయంలో ప్లాస్టిక్ కాళ్ళ ఏర్పాటుకు మంత్రి జగదీష్ రెడ్డి ( LOC ద్వారా 3లక్షల రూపాయలను అందించారు ) కుటుంబం గడవడం ఇబ్బందిగా మారిందని మంత్రి జగదీష్ రెడ్డిని కలిసి జ్యూస్ బండి ఏర్పాటు చేయాల్సిందిగా అందుకు తగిన సహాయం అందించమని నజీర్ పాష కోరారు. ఉపాధి హామీ పథకం ద్వారా కావలసిన సహాయం అందిస్తామని మంత్రి జగదీష్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రపంచా వికలాంగుల దినోత్సవం రోజు సదరు బాధితుడు నజీర్ పాషకు ప్లాస్టిక్ కాళ్ల నిమిత్తం 4.50 లక్షల రూపాయలను అందజేశారు. అంతేకాకుండా త్వరలో జ్యుస్ దుకానాన్ని ఏర్పాటు చేయించి తాను స్వయంగా వచ్చి ప్రారంభిస్తానన్న మంత్రి మాట ఇచ్చారు. ఆ మేరకు శుక్రవారం పట్టణంలోని ఖమ్మం క్రాస్ రోడ్ లో సదరు వికలాంగుడి జ్యూస్ బండిని ప్రారంభించి ఆ కుటుంబానికి బతుకుదెరువును చూపించారు. దీంతో వికలాంగుడి కుటుంబం ఆనందం వ్యక్తం చేస్తూ మా జీవితాంతం మంత్రి జగదీష్ రెడ్డికి రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలిపారు. అడిగిన వెంటనే హామీ ఇచ్చి అమలు చేసి అండగా నిలిచిన మంత్రి జగదీష్ రెడ్డి గారు సూర్యాపేట జిల్లాకు ఓ వరమని పలువురు హార్దం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News