Thursday, April 25, 2024

వినూత్న ప్రక్రియ రుతు ప్రేమ..

- Advertisement -
- Advertisement -

Minister Harish Guidance program on Ritu Prema project

సిద్దిపేటలో ప్రతి మహిళకు ఋతుస్రావ కప్పులు, బట్ట ప్యాడ్లు, బట్ట డైపర్ల ఉచిత పంపిణీ …

రాష్ట్రంలో తొలిసారి ప్రయోగాత్మకంగా ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ సరికొత్త ఆలోచన ..

సిద్దిపేట: స్వచ్చ సర్వేక్షణ్‌ 2021లో జాతీయ స్థాయి, దక్షిణాది రాష్ట్రాల్లో మొదటి స్థానంలో నిలిచిన సిద్దిపేట మున్సిపాలిటీ మరో ముందడుగు వేయాలని నిర్ణయించింది. పట్టణవ్యాప్తంగా మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ‘ఋతుప్రేమ’ పేరిట ప్రతీ మహిళకు ఋతుస్రావ కప్పులు, బట్ట ప్యాడ్లు, బట్ట డైపర్ల ఉచిత పంపిణీ చేసే ఓ సరికొత్త అవగాహన సదస్సు కు అంకురార్పణ చేశారు. రాష్ట్రఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు వినూత్న ఆలోచనకు సిద్దిపేట వేదికగా మారింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ వైద్యులతో మంత్రి హరీశ్ రావు హాజరయ్యారు.  ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… బట్ట ప్యాడ్స్ వాడటం లో ప్రపంచానికె సిద్దిపేట ఆదర్శంగా నిలవాలన్నారు.  ఋతు ప్రేమ అనేది మాట్లాడానికి జుగుప్సాకరంగా ఉంటుంది.  నేడు మనం మొదటి మెట్టు ఎక్కాం అంటే మీ మహిళల సహకారం వల్లనే. వీటి వాడకం వల్ల ఆరోగ్య సమస్యలతో పాటు, డబ్బు వృధా కాదు. ఇది ప్రపంచంలో ఉండే ప్రతి మహిళ కు ప్రతి నెల జరుగుతున్న ప్రక్రియ. ఈ వార్డు ప్రజలు తడి, పొడి, హానికరమైన చెత్త ఇవ్వడంలో అదర్షంగా నిలిచారు కావున ఈ వార్డు పైలెట్ ప్రాజెక్టుగా ఎన్నుకున్నామని ఆయన పేర్కొన్నారు.

మీ ఆరోగ్యంను మీరే కాపాడుకోవాలి, ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. వీటిని ప్రపంచ వ్యాప్తంగా వాడుతున్నారు. 35న్నర వేల కోట్ల మహిళలు ప్లాస్టిక్ వాడుతున్నారు. జిల్లాలోని మహిళ ఉద్యోగులకు త్వరలోనే అవగాహన సదస్సు పెట్టీ ప్యాడ్స్ పంపిణీ చేస్తాం. ఈ కార్యక్రమము రాష్ట్రం లోనే మొట్ట మొదటిసారిగా ఇక్కడ నిర్వహిస్తున్నాం. నార్మల్ డెలివరీ ఎక్కువగా చేయాలి. మన రాష్ట్రంలో డెలివరీ కోసం చేసే సర్జరీలు 62శాతం. మొదటి గంటలో ముర్రుపాలు తాగేది మన రాష్ట్రంలో 37శాతం మాత్రమే. పుట్టిన ఆరోగ్యం కాపాడాల్సిన బాధ్యత మనపైన ఉంది. రానున్న రోజుల్లో అన్ని వార్డులలో పంపిణీ చేస్తాం. ప్యాడ్స్ వాడకంలో మనం ప్రపంచానికి ఆదర్శం కావాలని మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News