Thursday, March 28, 2024

కానిస్టేబుల్ బాబ్జీకి మంత్రి హరీష్ ప్రశంస

- Advertisement -
- Advertisement -
Minister Harish praises traffic Constable Babji
ట్రాఫిక్‌లో చిక్కుకున్న అంబులెన్స్‌కు దారి చూపిన పిసి

హైదరాబాద్: నగరంలోని మొజంజాహీ మార్కెట్ వద్ద ట్రాఫిక్‌లో చిక్కుకున్న అంబులెన్స్‌కు ట్రాఫిక్ క్లియర్ చేసి ముందుకు వెళ్లేలా చేసిన ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను ఆర్థిక మంత్రి హరీష్ రావు అభినంధించారు. పోలీసు శాఖ గర్వంగా భావించేలా కానిస్టేబుల్ వ్యహరించారని మంత్రి కొనియాడారు. అబిడ్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న బాబ్జీ మొజంజాహీ మార్కెట్ వద్ద అంబులెన్స్ ట్రాఫిక్‌లో చిక్కుకోవడం చూశాడు. వెంటనే అంబులెన్స్ ముందు వెళ్లేందుకు దాని ముందు ఉన్న వాహనాలను పక్కకు తప్పిస్తు ముందుకు వెళ్లేలా చేశాడు. దీంతో సమయానికి ఆస్పత్రికి వెళ్లడంతో ఓ వ్యక్తి ప్రాణాలు నిలిచాయి. దీనికి సంబంధించిన వీడియోను బాధిత కుటుంబ సభ్యులు సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారింది. నెటిజన్లు, పోలీసు అధికారులు కానిస్టేబుల్ సమయస్ఫూర్తికి ప్రశంసలు కురిపించారు.

మెమెంటో అందజేసిన నగర కమిషనర్ అంజనీకుమార్

అంబులెన్స్ ముందుకు వెళ్లేలా చేసిన ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తన కార్యాలయానికి పిలిపించుకుని మెమొంటో అందజేశారు. సాయంత్రం సమయంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నా కూడా అంబులెన్స్ ముందు పరిగెడుతూ ముందుకు వెళ్లేలా చేసిన కానిస్టేబుల్ సేవలు అభినందనీయమని అన్నారు. కానిస్టేబుల్ అంబులెన్స్ ముందు దాదాపు 2కిలో మీటర్లు పరిగెత్తారని అన్నారు.

Minister Harish praises traffic Constable Babji

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News