Thursday, March 28, 2024

సిలిండర్ ధర వెయ్యి చేసి రూ.40 రాయితీ ఇస్తున్నారు: మంత్రి హరీశ్

- Advertisement -
- Advertisement -

Minister Harish Rao Comments on Central Government

హైదరాబాద్: సిలిండర్ ధర రూ. వెయ్యి చేసి రూ.40 రాయితీ ఇస్తున్నారని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. బిజెపి అధికారంలోకి రాకముందు సిలిండర్ ధర రూ.400 ఉందన్నారు. బిజెపి పాలనలో సిలిండర్ ధర రూ. వెయ్యికి పెంచారని ఆరోపించారు. రేపో, ఎల్లుండో సిలిండర్ పై మరో వంద పెంచుతారని చెప్పారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం వల్ల రైతులపై అధిక భారం పడుతుందన్నారు. ఆర్టీసికి సరఫరా చేసే డీజిల్ పై రూ. 5 పెంచారని ఆయన పేర్కొన్నారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు ఈ నెలలో విడుదల చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం బావులు, బోర్లు వద్ద మీటర్లు పెడితే ఏడాదికి రూ.5వేల చొప్పున ఐదేళ్లలో రూ.25 వేల కోట్లు ఇస్తామని మంత్రి హరీశ్ గుర్తు చేశారు. రూ.25 వేల కోట్లు వద్దు.. మీటర్లూ వద్దని కేంద్రానినకి స్పష్టం చేశామని మంత్రి తెలిపారు. మీటర్లు పెట్టే ప్రస్తక్తి లేదని సిఎం కెసిఆర్ తేల్చిచెప్పిన విషయాన్ని హరీశ్ రావు గుర్తుచేశారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్ లేదు. కేవలం తెలంగాణలో 24 గంటలూ ఉచిత కరెంట్ ఇస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News