Home Elections 2018 పొర్లు దండాలు పెడుతున్న కోదండరాం

పొర్లు దండాలు పెడుతున్న కోదండరాం

Minister Harish Rao Comments on Kodandaramహైదరాబాద్ : నాలుగు అసెబ్లీ స్థానాల కోసం తెలంగాణ జనసమితి (టిజెఎస్) అధ్యక్షుడు కోదండరాం గాంధీభవన్ ఎదుట పొర్లు దండాలు పెడుతున్నారని టిఆర్‌ఎస్ నేత, మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. సోమవారం హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. గతంలో కాంగ్రెస్‌ను విమర్శించిన కోదండరాం, ఇప్పుడు అదే పార్టీతో అంటకాగడాన్ని ప్రజలు గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఉద్యమ సమయంలో కోదండరాంపై అనేక కేసులు పెట్టారన్ని, ఈ విషయాన్ని మరిచి కోదండరాం కాంగ్రెస్‌తో కలవడం విడ్డూరంగా ఉందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమకారులను చట్టసభలకు పంపిన చరిత్ర టిఆర్‌ఎస్‌దని ఆయన స్పష్టం చేశారు. 2014 ఎన్నికల్లో కోదండరాం కాంగ్రెస్‌కు పరోక్షంగా సహకరించారని, ఇప్పుడు ప్రత్యక్షంగా సహకరిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. అధికార దాహంతో ఓట్ల కోసం వస్తున్న మహాకూటమి నేతలకు తగిన బుద్ధి చెప్పాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రజలు టిఆర్‌ఎస్ వైపే ఉన్నారని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వందకు పైగా సీట్లు సాధించి మళ్లీ తామే అధికారంలోకి వస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Minister Harish Rao Comments on Kodandaram