Friday, March 29, 2024

కారు.. కెసిఆర్ వైపు నిలబడండి

- Advertisement -
- Advertisement -

Minister Harish Rao Dubbaka Election Campaign

తొగుట: కాంగ్రెస్, బీజేపీలకు ఓటు ఎందుకు వేయాలో ఆలోచించాలని ప్రజలంతా కారు.. కేసీఆర్ వైపు ఉండాలని రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. గురువారం తొగుట మండలం ఘనపూర్, గుడికందులలో ప్రచారం నిర్వహించి అనంతరం రోడ్‌షోలో మాట్లాడారు. తెలంగాణ రాకముందు రైతుల పరిస్థితి అత్యంత దుర్భరమని కాంగ్రెస్, టీడీపీ పాలనలో రైతులకు ఆత్మహత్యలే మిగిలాయని మంత్రి గుర్తు చేశారు. తెలంగాణ వచ్చాక రైతుల పరిస్థితి మారిందని అన్నారు. నైజం కాలంలో భూమి ఉన్న ప్రతి ఒక్కరి దగ్గరి నుంచి శిస్తు వసూలు చేశారని ఇప్పుడు సీఎం కేసీఆర్ మాత్రం ప్రతి ఎకరాకు ఏడాదికి రూ.10 వేలు ఇస్తూ చరిత్ర తిరగరాశారని అన్నారు.

రైతుల బతుకుల్లో మార్పు రావాలని సీఎం కేసీఆర్ 24గంటల కరెంట్, రైతు బంధు, ఇస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ వాళ్లు, సీసలు, పైసలు ఇస్తారని లేదంటే హరీశ్‌రావును తిడతారని అంతే తప్ప వాళ్ల చేతిలో ఏమీ లేదని అన్నారు. బీజేపీ వాళ్లు పారిన్ నుంచి మక్కలు తెచ్చి తెలంగాణా కోళ్లకు పోస్తే మన దగ్గర పండిన మక్కలను ఎవరు కొంటారని ప్రశ్నించారు. బీజేపీ ఎవరి ప్రయోజనాల కోసం పని చేస్తోందని మండి పడ్డారు. మార్కెట్లను ప్రయివేటు పరం చేసి రైతులకు మద్దతు ధర లేకుండా చేస్తున్నారని అన్నారు. బీజేపీ పాలిస్తున్న 17 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పాలిస్తున్న 5 రాష్ట్రాల్లో ఎక్కడైనా 24 గంటల ఉచిత కరెట్ ఎకరాకు 10 వేలు ఇస్తున్నారో లేదో చెప్పి ఓట్లు అడగాలని అన్నారు. వచ్చే మూడేళ్లు అధికారంలో ఉండేది టీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని అభివృద్ధి తమతోనే సాధ్యమవుతుందని అన్నారు.

పని ఏదైనా తన ఇంటి తలుపులు తెరిచే ఉంటాయని మంత్రి భరోసానిచ్చారు. కాంగ్రెస్ చేతిలో నెత్తి లేదు.. కత్తి లేదని వాళ్లేం చేయలేరని అన్నారు. బీజేపీ వాళ్ల చేతిలో గ్లోబెల్స్ ప్రచారం తప్ప ఏమీ లేదని అన్నారు. బీహర్ లో బీజేపీ అధికారంలో ఉందని అక్కడ ఎన్నికల్లో మళ్లీ బీజేపీ గెలిస్తేనే డబుల్ ఇంజన్ గ్రోత్ ఉంటుందని నరేంద్ర మోడీ అంటున్నారని తెలంగాణాలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉందని ఇక్కడ కూడా టీఆర్‌ఎస్ గెలిస్తేనే డబుల్ ఇంజన్ గ్రోత్ ఉంటుందని అన్నారు . రాదనుకున్న తెలంగాణను కాదనుకున్న కాళేశ్వరం ప్రాజెక్టును తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని అన్నారు. అంతకుముందు ఘనపూర్ గ్రామంలో కాలబైరవ స్వామి, తొగుట ఇన్‌చార్జి ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్‌తో కలిసి పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ హరికృష్ణారెడ్డి, గుడికందుల సర్పంచ్ మల్లయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ అనితా లకా్ష్మరెడ్డి, చిట్టి దేవేందర్ రెడ్డి, నాయకులు సిరివెరి రాంరెడ్డి, సర్పంచులు ఎల్లం , నర్సింలు, శారదా రఘోత్తంరెడ్డి, దేవీ రవీందర్, గంట రవీందర్, జడ్పీటీసీ ఇంద్రసేనారెడ్డి, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News