Friday, April 19, 2024

గులాబీమయమైన దుబ్బాక వీధులు

- Advertisement -
- Advertisement -

BJP leaders joined TRS in presence of Harish Rao

సిద్దిపేట: దుబ్బాక ఎన్నికల ప్రచారంలో మహిళలు కదంతొక్కారు. దుబ్బాకలో టిఆర్ఆస్ అభ్యర్థి సోలిపేట సుజాతకు అపూర్వ ఆదరణ లభించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా మహిళలు భారీ ర్యాలీ చేపట్టారు. జెండాలు, బ్యానర్లు, బతుకమ్మలు,జోనాలతో మహిళలు ర్యాలీలో పాల్గొన్నారు. దీంతో  దుబ్బాక వీధులు గులాబీమయ్యాయి. తెలంగాణతల్లి చౌరస్తాలో ఆటపాటలతో ధూంధాం కళాకారులు హోరెత్తించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ… కాంగ్రెస్, బిజెపి వాళ్లు కిరాయి మనుషులు, పరాయి నేతలతో ప్రచారం చేయిస్తున్నారు. దుబ్బాక నియోజకవర్గంలోనే 60వేల మందికి పైగా పెన్షన్లు ఇస్తున్నామని చెప్పారు. ఇచ్చే రూ. 2016 పెన్షల్ లో 16 పైసలు కూడా కేంద్రానివి కావు. కేంద్ర రూ. 1600 ఇస్తున్నట్టు నిరూపించాలని సవాల్ చేస్తే బిజెపి నేతలు ముఖం నేలకేసిండ్రు.

రూ. 800 కోట్లతో ఇంటింటికి నల్లా పెట్టించింది సోలిపేట రామలింగారెడ్డి. మహిళలకు పెద్ద కొడుకు లెక్క సిఎం కెసిఆర్ ఆదుకుంటున్నారు. దుబ్బాకలో ఏదీ కనబడ్డా బిజెపి ఇచ్చిందని ప్రచారం చేస్తున్నారు. తెలంగాణకు బిజెపి ప్రభుత్వం ఇచ్చింది ఏమీలేదు. ఎన్నికలు అయిపోతే కాంగ్రెస్, బిజెపోళ్ల అడ్రసు ఉండదు. ఇంటింటికి తాగునీరు, ప్రతి ఎకరానికి సాగునీరు ఇచ్చింది సిఎం కెసిఆర్. ఏండ్ల తరబడి పరిపాలించిన కాంగ్రెస్ గుక్కెడు నీళ్లివ్వలేదు. సిఎం కెసిఆర్.. అన్న నిలబెట్టుకొని హామీలు నెరవేరుస్తున్నాడు. కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకంతో పేదింటి ఆడబిడ్డలకు పెళ్లికి సాయం చేసినం. ప్రజలకు ఉత్తమ సేవలందించినందుకు దుబ్బాక ప్రభుత్వాస్పత్రికి కాయకల్ప అవార్డు వచ్చింది. దుబ్బాకలో ఇండ్లులేనివారికి ప్రతి ఒక్కరికి ఇండ్లు కట్టిస్తం. కాంగ్రెస్ హయంలో కరెంట్ కష్టాలు అంతా ఇంతాకాదు. వచ్చీరాని కరెంట్ తో మోటార్లు కాలిపోయేవి. తెలంగాణ వచ్చినంక 24గంటలు కరెంట్ ఇస్తున్నం. కరోనా కష్టకాలంలో ప్రతి ఒక్కరికి నిత్యావసరాలు పంపిణీ చేసినమని మంత్రి హరీశ్ పేర్కొన్నారు.

Minister Harish Rao Election Campaign in Dubbaka

Minister Harish Rao Election Campaign in Dubbaka

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News