Home తాజా వార్తలు వీణవంకలో మంత్రి హరీశ్ రావు ఎన్నికల ప్రచారం

వీణవంకలో మంత్రి హరీశ్ రావు ఎన్నికల ప్రచారం

Minister Harish Rao Election Campaign In Veenavankaకరీంనగర్ : వీణవంక మండలం చల్లూరులో టిఆర్ఎస్ అభ్యర్థి శ్రీనివాస్ యాదవ్ తో కలిసి మంత్రి హరీష్ రావు ప్రచారం సోమవారం ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడారు. ఓట్ల కోసం బిజెపి నాయకులు మొండి మాటలు, తొండి మాటలు మాట్టాడుతున్నారని, వారిని నమ్మొద్దని ఆయన ప్రజలను కోరారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలు పెంచి పేదల నడ్డి విరుస్తుందని ఆయన ధ్వజమెత్తారు. అటువంటి బిజెపికి ఓటేస్తే , ఒనగూరే ప్రయోజనం ఏమీ లేదని ఆయన తేల్చిచెప్పారు. రైతల కోసం అనేక పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం తమదేనని ఆయన పేర్కొన్నారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో టిఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ ఘన విజయం సాధించడం ఖాయమని హరీశ్ రావు పేర్కొన్నారు. ఈ ఎన్నికల ప్రచారంలో  ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, వివేకానంద్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, టిఆర్ఎస్ నాయకుడు పాడి కౌశిక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.