Wednesday, November 30, 2022

కెసిఆర్ కు శుభాకాంక్షలు తెలిపిన హరీశ్ రావు

- Advertisement -

Minister Harish Rao Greetings To CM KCRహైద‌రాబాద్ : టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా మరో సారి ఎన్నికైనా సిఎం కెసిఆర్‌కు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హ‌రీశ్‌రావు శుభాకాంక్ష‌లు తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమాన్ని ప్రారంభించి, అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్న మహానేత కెసిఆర్ అని హరీశ్ రావు కొనియాడారు. ప్రజల ఆకాంక్షను నెరవేర్చి, వారి మదిలో సుస్థిర స్థానం సంపాదించుకున్న మహానాయకుడు కెసిఆర్ అని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ సాధనలో పదవులను సైతం గడ్డి పోచలుగా త్యాగం చేసి, టిఆర్ఎస్ ను స్థాపించి తెలంగాణ సాధించిన కెసిఆర్ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచారని హరీశ్ రావు స్పష్టం చేశారు. ఉద్యమ స్ఫూర్తితో బంగారు తెలంగాణ స్థాపనకు ఎనలేని కృషి చేస్తున్న కెసిఆర్ బాటలో యువత ముందుకు సాగాలని ఆయన సూచించారు. 20 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న టిఆర్ఎస్ వచ్చే 20 ఏళ్లు రాష్ట్రంలో అధికారంలో ఉండడం ఖాయమని హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు.

Related Articles

- Advertisement -

Latest Articles