Friday, March 29, 2024

తెలంగాణకు మాటలు… గుజరాత్‌కు మూటలు

- Advertisement -
- Advertisement -

Minister Harish Rao inauguration of Bus Depot at Narsapur

నర్సాపూర్: మెదక్ జిల్లా నర్సాపూర్ లో మంత్రులు తన్నీరు హరీశ్ రావు, పువ్వాడ అజయ్ కుమార్ ఆర్టీసీ డిపోను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ…మూడు దశాబ్ధాల కలను నిజం చేసిన ఘనత ఎమ్మెల్యే మదన్ రెడ్డి అని మంత్రి అన్నారు. మీ అందరి పక్షాన సిఎం కెసిఆర్ కి కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు. ధర్నాలు, నిరహార దీక్షలు, రాస్తారోకోలు ఎన్నో ఆర్టీసీ డిపో కోసం జరిగాయని గుర్తుచేశారు. అలాంటి కల నిజం అయింది. తెలంగాణ వచ్చాక మొట్టమొదటి ఆర్టీసీ డిపోను సిఎం మంజూరు చేశారు. కరోనా రాకపోతే రెండేళ్ల క్రితమే డిపో వచ్చేది. ఇంకా బస్సులు కావాలని మదన్ రెడ్డి కోరారు. మంత్రి పువ్వాడ అజయ్ కావాల్సిన బస్సులు ఇస్తానని హమీ ఇచ్చారు. బస్సులు ఇస్తే ఆటోలు ఎక్కుతాం అంటే కాదు.. ఆర్టీసీని కాపాడాలి. ఆర్టీసీ ప్రయాణం సురక్షితమైనది. ప్రమాదాలు తక్కువని మంత్రి పేర్కొన్నారు.

ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం అమ్ముతోందని ఫైర్ అయ్యారు. ప్రభుత్వ సంస్థలను అమ్మితే ప్రోత్సాహకాలు ఇస్తామంటోందన్నారు. బిజెపి అధికారంలోకి వస్తే ఆర్టీసిని కూడా అమ్ముతారని తెలిపారు. డబుల్ ఇంజిన్ సర్కారున్న కర్నాటకలో పరిస్థితి ఏంటి అని మంత్రి ప్రశ్నించారు. కర్నాటక రైతులు రాష్ట్రానికి ధాన్యం తెచ్చి అమ్ముకుంటున్నారు. తెలంగాణలో సంక్షేమ పథకాలు కర్నాటకలో లేవని చెప్పారు. వడ్లు కొనకుండా కేంద్రం రాజకీయాలు చేసిందని గుర్తు చేశారు. రైతులు ఇబ్బంది పడొద్దని రాష్ట్రప్రభుత్వమే ధాన్యం కొంటోందని పేర్కొన్నారు. కేంద్రం తీరు తెలంగాణకు మాటలు.. గుజరాత్ కు మూటలు అన్నట్లుందని విమర్శించారు. తెలంగాణకు 15వ ఆర్థిక సంఘం నుండి రావాల్సిన 9 వేల కోట్లు ఇవ్వకుండా మోసం చేస్తున్నారని మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News